సినిమాలో హీరో చూపించే హీరోయిజమే అభిమానులకు కావల్సింది అటువంటిది ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇద్దరు హీరోల అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతాయి. బాలీవుడ్ లో అయితే ఓకే గానీ.. తెలుగులో ఆ పరిస్థితి లేదు. హీరోలను బట్టి అంచనాలు మారిపోతూంటాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ పోస్టర్ రిలీజ్ కే ఆస్థాయి సంబరాలు చేస్తే సినిమా విడుదలకు ఇంకెంత చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి పవన్ కల్యాణ్ మల్టీస్టారర్ చేస్తే మరో హీరో కూడా మంచి మాస్ లుక్ ఉంటే అద్భుతమే.

IHG

 

పవన్ కల్యాణ్-రవితేజ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ రాబోతోందని ఇటివల వార్తలు వచ్చాయి. దీనిపై అఫిషియల్ క్లారిటీ లేకపోయినా ఇది మంచి కాంబినేషన్ అవుతుందనే చెప్పాలి. ఇద్దరికీ మాస్ లో మంచి పట్టు ఉంది. పవన్ మ్యానరిజం, స్టైల్.. రవితేజ మాస్ యాక్షన్, డైలాగ్స్ తో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇద్దరికీ కామెడీపై మంచి పట్టు ఉండటం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. అభిమానుల మధ్య పోటీ కూడా ఉండకుండా ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దమ్మున్న కథ వీరిద్దరి కోసం సిద్ధమైతే ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా ఇస్తారనడంలో సందేహం లేదు.

IHG

 

మల్టీస్టారర్ సినిమాలు ఉదహరించడానికి చాలానే ఉన్నాయి. కానీ.. అన్నింటిలోకి 1988లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఘర్షణ’ ప్రత్యేకం అని చెప్పాలి. ప్రభు, కార్తీక్ లను ఇద్దరిలో ఒకరెక్కువ, తక్కువ కాకుండా బ్యాలెన్సింగ్ గా తీసిన ఆ సినిమా మల్టీస్టారర్లకు డిక్షనరీ అని చెప్పాలి. ఆస్థాయిలో కథ, కథనాలు ఉంటే పవన్-రవితేజతో మల్టీస్టారర్ అసాధ్యమేమీ కాదు. ఇద్దరి ఇమేజ్ కు ప్రేక్షకుల అంచనాలకు సరిపోయే పర్ఫెక్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో సందేహం లేదు.

IHG's Viral Act

మరింత సమాచారం తెలుసుకోండి: