టాలీవుడ్ లో చిరంజీవి కి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే చాలా మందికి ఒక రేంజ్ లో పండగ మాదిరి ఉంటుంది. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు జనాలు అనే సంగతి అందరికి తెలిసిందే. సినిమా కోసం గానూ పనులు మానుకుని వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనేది వాస్తవం. ఇక వీరి కాంబినేషన్ లో ఒక్క ప్రాజెక్ట్ వచ్చినా సరే ఇక దానికి తిరుగు ఉండదు. అది కాసుల వర్షం కురిపించడం అనేది ఖాయం. 

 

ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాత అయిన సుబ్బిరామి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు గాని అది సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు దాదాపుగా ఈ మధ్య కాలంలో కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం అటు మెగా అభిమానులతో పాటుగా ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు అనేది అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత అయినా సరే తాను కచ్చితంగా పెడతా అంటూ సుబ్బిరామి రెడ్డి నుంచి ఒక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. 

 

ఇక ఈ సినిమాలో చిరంజీవిని అన్నయ్య గానే పవన్ కళ్యాణ్ ని తమ్ముడు గా మాత్రమే చూస్తే బాగుంటుంది గాని వారి పాత్రల్లో ఏ మార్పు వచ్చినా సరే అసలు చూడలేము అంటూ చాలా మంది వ్యాఖ్యలు కూడా ఇప్పటి నుంచే చేస్తూ వస్తున్నారు. మరి ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది అనేది చూడాలి. కాగా ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: