మన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్... అలాగే బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో రణవీర్ సింగ్. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే ప్రచారం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే జరుగుతూ వస్తుంది. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలి అని చాలా మందికి ఆశగా కూడా ఉంది. అయితే అది కొన్ని కారణాలతో సెట్స్ మీదకు వెళ్ళడం అనేది కాస్త కష్టంగానే ఉంది అనే చెప్పాలి. అయితే వీరి కాంబినేషన్ లో ఒక సినిమా కోసం అటు బాలీవుడ్ తో పాటుగా ఇటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. 

 

ఇక సినిమాకు వసూళ్ళ పంట ఖాయం అని చాలా మంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే నిర్మాతకు ఇక కాసుల వర్షం కురుస్తుందని సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ముందు ప్రీ రిలీజ్ మార్కెట్ కే  అతను పెట్టే పెట్టుబడి వచ్చేస్తుంది అంటూ చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక నిర్మాత వనేక్కు తిరిగి చూసుకునే అవసరం ఉండదు అని అంటారు టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే. వీరి కాంబినేషన్ లో ఒక సినిమా చేసే సాహసం దర్శక నిర్మాతలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. ఇక వీరు ఇద్దరూ కూడా ఇప్పుడు దాదాపు మంచి క్రేజ్ ఉన్న హీరోలు. 

 

ఇక వీరి కాంబినేషన్ లో సినిమా కోసం గానూ సంజయ్ లీలా బన్సాలి ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా జరుగుతుంది. కాని అది మాత్రం ముందుకు వెళ్ళే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు మరి. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: