కరోనా సమస్యలను కూడ ఎదిరించి ఎదో విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను ముందుకు నడిపించాలి అన్న ఆలోచనలతో రాజమౌళి చేసిన ప్రయత్నాలు అన్నీ వృథా అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ఈమధ్య హైదరాబాద్ లోని పాత అల్యూమినియం ఫ్యాక్టరీలో చరణ్ జూనియర్ ల స్థానంలో డూపులను పెట్టితీసిన కొన్ని యాక్షన్ సీన్స్ అవుట్ పుట్ రాజమౌళికి తీవ్ర నిరాశ కలిగించినట్లు టాక్.


దీనితో ఇలాంటి నాసిరకం అవుట్ పుట్ ను ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ తీయడంకన్నా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను వాయిదా వేయడం మంచిది అన్న అభిప్రాయానికి రాజమౌళి వచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి లాంటి తలలు పండిన మేధావి కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ షూట్ ను ప్రస్తుత పరిస్థితులలో కొనసాగించడానికి మార్గాలు లేక చేతులు ఎత్తేయడంతో ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న భారీ సినిమాలు అన్నీ ఇక ఇప్పట్లో షూటింగ్ ఆలోచనలు చేయవు అన్నసంకేతాలు వస్తున్నాయి. 


ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ సినిమాలు అన్నీ ఇప్పట్లో షూటింగ్ లు మొదలుపెట్టే అవకాశాలు కనిపించకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి కూడ పెద్ద సినిమాల హవా ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే ఒక్క ‘వకీల్ సాబ్’ పెండింగ్ షూటింగ్ చాల తక్కువగా ఉన్న పరిస్థితులలో పవన్ సినిమాకు మాత్రం సంక్రాంతి యోగం పట్టవచ్చు అనిఅంటున్నారు. 


‘ఆర్ ఆర్ ఆర్’ ట్రయిల్ షూట్ ఫెయిల్ కావడంతో మరొక ట్రయిల్ షూట్ తీయాలి అన్న ఆలోచనలు రాజమౌళి చేసినా జూనియర్ చరణ్ ల ఒత్తిడితో రాజమౌళి తన ఆలోచనలు మానుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పట్టుదలకు మారుపేరుగా పేరుగాంచిన రాజమౌళి లాంటి మేధావి కూడ ట్రయిల్ విషయంలో ఫెయిల్ అయినట్లు వార్తలు వస్తూ ఉండటంతో ఇక ఏటాప్ దర్శకుడు ప్రస్తుత వ్యతిరేక పరిస్థితులలో షూటింగ్ ల జోలికి ఇక వెళ్ళకపోవచ్చు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: