సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎంతో మంది వస్తుంటారు. కానీ ఆ అవకాశం కొందరికే వస్తుంది. వెండితెర మీద కనిపించాలంటే అదృష్టం ఉండాలంటారు. నీకెంత గొప్ప టాలెంట్ ఉన్నా కొంచెమైనా అదృష్టం లేకపోతే ఆ టాలెంట్ బయటకి కనిపించకుండా పోతుంది. అందుకే గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకోవాలంటే అనేక దార్లున్నాయి.

 

గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగుతూ, క్రిష్ణా నగర్ లో అద్దెకి దిగి ఎన్నో అవస్థలు పడుతూ, తీవ్ర ఇబ్బందులని ఎదుర్కొని అవకాశాలు చేజిక్కించుకునే వాళ్ళు. కానీ పరిస్థితి ఇప్పుడలా లేదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఈజీ అయిపోయింది. మనకున్న టాలెంట్ ని ప్రదర్శించుకునే మార్గాలు చాలా ఎక్కువయ్యాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి ఎదిగిన వాళ్లని ఎంతో మందిని చూసాం.

 

ఇప్పుడు తాజాగా టిక్ టాక్ ద్వారా వెండితెర వరకూ సాగిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. యువతలో టిక్ టాక్ కి ఉన్న ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ యాప్ ద్వారా రోజూ వేలల్లో వీడియోస్ అప్ లోడ్ అవుతుంటాయి. స్టార్ హీరోయిన్స్ తరహాలో ఇక్కడ పాపులర్ అయిన వాళ్లకి కూడా మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే చాలా మంది తమ టాలెంట్ ని చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రదర్శిస్తుంటారు.

 

తాజగా టిక్ టాక్ స్టార్ కి వెండితెర అవకాశం వచ్చింది. త‌నే.. వ‌ర్షిణి. బ‌న్నీ వాక్స్ పేరుతో ట్విట్ట‌ర్ లో ఫేమ‌స్ అయ్యింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయికి టిక్ టాక్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఒకానొక లవ్ స్టోరీలో ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. ఏదైతేనేం మొత్తానికి టిక్ టాక్ నుండి వెండితెరకి వచ్చింది. మరి ఈ టిక్ టాక్ స్టార్ సినిమాల్లో రాణిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: