దేశంలోకరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఆ మద్య రెండు నెలలు కళ్లారా చూశారు.  ముఖ్యంగా చిరు ఉద్యోగుల, వ్యాపారలు ఏం చేయలేక.. తినడానికి తిండి లేక నానా అగచాట్లు పడ్డారు.  ఇక సినిమా పరిశ్రమకు సంబంధించిన దినసరి కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఈ సమయంలో ఆయా సినీ పెద్దలు ముందుకు వచ్చి వారి చేదోడువాదోడుగా ఉన్నారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్.

IHG

వందలాది వలస కార్మికులకు పెద్దన్నగా బాధ్యతలు స్వీకరించారు.  వారి కష్టాన్ని దగ్గరుండి చూసిన సోనూ సూద్ సొంత ఖర్చులతో బస్సు, రైళ్లు, విమాన్లలో కూడా పంపించారు.  ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా.. సోనూపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తనపై వస్తున్న విమర్శలపై సోనూ సూద్ తాజాగా స్పందించాడు. విమర్శలు తనకు కొండంత బలాన్ని ఇస్తాయని, మరెన్నో మంచి పనులు చేసేందుకు తనలో ఉత్సాహాన్ని నింపుతాయని అన్నాడు. నిజానికి ఆ ఆరోపణలను ఇప్పటి వరకు తాను పట్టించుకోలేదని అన్నాడు.

IHG

అయితే మనం చేసిన మంచి పనులు అందరికీ తెలియాలి అంతే కానీ మనం తెలియాల్సిన అవసరం లేదు. తనపై విమర్శలు చేసిన సమయంలో ఎవరైనా వచ్చి వాటిపై స్పందించమని అడిగితే అప్పుడు ఒకటే చెప్పేవాడినని, వలస కార్మికులకు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో తీరికలేకుండా ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి స్పందించే సమయం లేదని చెప్పేవాడినని అన్నారు. మంచి పని చేస్తున్నప్పుడు ఇలాంటివి సహజమేనన్నాడు.  లాక్ డౌన్ సడలించిన తర్వాత ముంబాయిలో కేసులు పెరగిపోతున్న విషయం తెలిసిందే.  ఏది ఏమైనా సోనూ సూద్ మంచి తనం దేశం మొత్తం మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: