టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హ‌వా కొన‌సాగుతోంది. వాస్త‌వానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల టైమ్‌లో రెగ్యులర్‌గా మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి. ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు అంటే అందరూ మరిచిపోయారు. చేస్తే హీరోలే డబుల్ రోల్ చేయడం చూశారు కానీ, మల్టీస్టారర్ సినిమాలు దాదాపు అందరూ మరిచిపోయారు. అయితే ఇలాంటి సమయంలో మ‌ళ్లీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఊపందుకున్నాయి. కమర్షియల్ హంగులతో కూడిన వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు మన హీరోలు సై అంటున్నారు. 

IHG's birthday video in making

అలాగే మంచి కథలు దొరికితే మల్టీస్టారర్ సినిమాలకు తాము సిద్దంగా ఉన్నామంటున్నారు. ఇక అలాంటి సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు సైతం ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఎప్ప‌టినుంచో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ వ‌స్తే బాగుంటుంద‌న్న టాక్ టాలీవుడ్‌తో పాటు అటు అభిమానుల్లోనూ బలంగా వినిపిస్తుంది. వాస్త‌వానికి ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ ఎన‌ర్జీ లెవ‌ల్స్ దాదాపు ఒకే రేంజ్‌లో ఉంటాయి. న‌ల‌న‌లో కానీ, నాట్యంలో కానీ ఇద్ద‌రు ఇద్ద‌రే. 

IHG

అలాంటి ఈ ఇద్ద‌రితో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ వ‌స్తే ఖ‌చ్చితంగా బాక్సాఫిస్ షేక్  అవుతుంద‌ని పలువురు ప్రేక్షకుల తో పాటు ఈ ఇద్దరు హీరోల అభిమానులు అంటున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం అంటే సాధారణమైన విషయం కాద‌నే చెప్పాలి.  మరి ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో చూపించే దర్శకుడు ఎవరో, అసలు ఈ ఇద్దరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో తెలియాలి అంటే మాత్రం మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఇటీవల వచ్చిన బన్నీ, అల వైకుంఠపురంలో సినిమా సందర్భంగా బన్నీ,తారక్ ఇద్దరు బావ అని సంభోదించడం బట్టి చూస్తే.. వీళ్లద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్పనక్కర్లేదు. ఈ క్ర‌మంలోనే అభిమానులు ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ కోసం ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: