టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. బాబు సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో పండగ. సినిమా కోసం పనులు మానుకుని  మరీ వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. అతని సినిమా గురించి  చిన్న వార్త వచ్చినా సరే జనాలు మిస్ అవ్వకకుండా చదివే  పరిస్థితి ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్  అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత అతను చేసే సినిమా మీద అందరికి ఆసక్తి ఉంది. 

 

సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ మనసులో మాట ఏంటీ అంటే అతను రజని కాంత్ తో కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. అవును రజని కాంత్ తో కలిసి ఒక సినిమా చేస్తే చాలా మందికి చూడాలని ఉందట. ఈ విషయాన్ని ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో చెప్పారు. రజని తారక్ కి తండ్రిగా పెదరాయుడు సినిమా రేంజ్ లో చెయ్యాలి అని కోరుతున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనేది చూడాలి. వారి కాంబినేషన్ లో మూవీ వచ్చింది అంటే మాత్రం ఫాన్స్ కి పండగ. 

 

ఇక నిర్మాతకు అయితే కాసుల వర్షం కురుస్తుంది. తమిళం లో తెలుగు లో కూడా ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ అనేది వచ్చేస్తుంది. సినిమా మార్కెటింగ్ కూడా ఒక రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి ఈ ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనేది చూడాలి. కాగా  తారక్ ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: