బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా హృతిక్ రోషన్ కి మంచి పేరు ఉంది. మన తెలుగు లో యాక్షన్ హీరో గా ప్రభాస్ కి మంచి పేరు ఉంది. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలి అని చాలా మందికి ఉంటుంది. వీరు ఇద్దరూ కూడా రెండు భాషల్లో తమ ప్రభావం చూపిస్తున్నారు. ఇక ధూమ్ క్రిష్ సినిమాలతో హ్రితిక్ రోషన్ తెలుగు లో మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా అతనికి మన  తెలుగు లో మంచి పేరు తీసుకుని వచ్చాయి. ఆయన సినిమాలు వస్తే అక్కడి నుంచి వరుసగా చూస్తూ ఉంటారు. 

 

ఇక భాష అర్ధం అయినా కాకపోయినా సరే కచ్చితంగా సినిమాలను చూసే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పాలి. ఇక వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలి అని భావించే చాలా మంది హృతిక్ ని విలన్ అయితే బాగుంతుంది అంటూ కామెంట్ లు చేస్తూ ఉంటారు. ప్రభాస్ హీరో అయి హ్రితిక్ విలన్ అయి అది యాక్షన్ అండ్ లవ్ డ్రామా అయి వారి ఇద్దరి మధ్య ఫైట్ సన్నివేశాలు ఉంటే చూడాలి అని ఉంటుంది అంటూ చాలా మంది సాహో సినిమా సమయంలో కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. 

 

ఇక ప్రభాస్ కి బాలీవుడ్ మీద అంతగా ఆసక్తి లేదు అని అనుకున్నా సరే ఇప్పుడు అతను ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక ప్రభాస్ తో సినిమా చెయ్యాలి అని బాలీవుడ్ హీరో లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం అతనికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటమే అని అంటున్నారు సినీ పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: