లీడర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన రానా దగ్గుబాటి, మొదటి సినిమాతో విలక్షణమైన కథని ఎంచుకుని టాలీవుడ్ హీరోలందరిలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇప్పటి వరకూ రానా చేసిన చిత్రాలన్నీ విభిన్నమైన చిత్రాలే. కమర్షియల్ అంశాలే కాకుండా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ, ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. బాహుబలి సినిమాలో భళ్లలదేవగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

 

ప్రస్తుతం రానా చేతిలో మూడు సినిమాలున్నాయి. ప్రభు సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం అరణ్య ఒకటి కాగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం మరోటి. వీటితో పాటు ఇంకా స్టార్ట్ కాని మరో చిత్రం కూడా ఉంది. ఒక్కడు సినిమాతో మహేష్ బాబుకి మంచి మాస్ సినిమాని ఇచ్చిన గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న హిరణ్యకశ్యప చిత్రం కూడా లైన్లో ఉంది.

 

2015లో వచిన రుద్రమదేవి తర్వాత్ర గుణశేఖర్ ఈ సినిమాపై వర్క్ చేస్తూ వస్తున్నాడు. దాదాపు మూడేళ్ళ నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయట. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడి చేసాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రానా ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

IHG

అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియో ముందుకు వస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియో మధ్య చర్చలు జరుగుతున్నాయట. మరి ఇదే నిజమైతే హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మించనున్న మొదటి సౌత్ సినిమా ఇదే అవుతుంది. చూడాలి మరేం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: