రొమాంటిక్ హీరో అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్లో ఎన్నో శృంగార భరితమైన సన్నివేశాల్లో నటించి అభిమానులను బాగా అలరించాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మధుడు 2 సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. సోగ్గాడే చిన్నినాయన చిత్రం లో హీరోగా నటించిన నాగార్జున అనుష్క శెట్టి, లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ లతో రొమాన్స్ చేసి వావ్ అనిపించాడు. అప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మధుడు సినిమా అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టిందంటే అతిశయోక్తి కాదు. 


తన అందచందాలతో ఎంతో మంది అమ్మాయిలను తన ఫ్యాన్స్ చేసుకున్న అక్కినేని నాగార్జున కెరీర్ తొలినాళ్లలో శివ వంటి మాస్ సినిమాలలో నటించి... ఆ తర్వాత గీతాంజలి మన్మధుడు నిన్నే పెళ్ళాడతా సంతోషం వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించాడు. శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ వంటి అన్ని రకాలు సినిమాల్లో నటించినప్పటికీ ఆయనకు రొమాంటిక్ హీరో అనే పేరు శాశ్వతంగా ముద్ర పడిపోయింది. 

 

తెలుగులో అక్కినేని నాగార్జున రొమాంటిక్ హీరోగా పేరు పొందితే హిందీలో రణ్‌బీర్‌ కపూర్ రొమాంటిక్ హీరోగా పేరుపొందాడు అని చెప్పుకోవచ్చు. రణ్‌బీర్‌ కపూర్ దీపికా పడుకొనే వెండి తెరపై కనిపిస్తే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. తమాషా, హే దిల్ హై ముష్కిల్, సావరియా వంటి హిందీ రొమాంటిక్ చిత్రాల్లో అత్యద్భుతంగా నటించి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రణ్‌బీర్‌ కపూర్ అంటే హిందీ అమ్మాయిలు చెవి కోసుకొంటారు. కేవలం సామాన్యలు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా రణ్‌బీర్‌ కపూర్ ని బాగా ఇష్టపడుతుంటారు. 

 

బ్రహ్మాస్త్ర సినిమాలో అక్కినేని నాగార్జున ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించాడు కానీ వాళ్ళు ఇద్దరు కలిసి ఎప్పుడు హీరోగా ఒక సినిమాలో నటించలేదు. ఒకవేళ అక్కినేని నాగార్జున, రణ్‌బీర్‌ కపూర్ కలసి ఒక రొమాంటిక్ చిత్రంలో నటిస్తే ఫిమేల్ ఫ్యాన్స్ వేల సంఖ్యలో థియేటర్లకు తరలి వస్తారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు చేసే బీభత్సమైన రొమాన్స్ చూడడానికి మగవారు కూడా అధిక సంఖ్యలో వస్తారు. నాగార్జున కోసం తెలుగు ప్రజలు సినిమా చూడడానికి వస్తే హిందీ ప్రేక్షకులు రణబీర్ కోసం థియేటర్ల ముందు క్యూ కడతారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్లో ఒక శృంగార భరిత చిత్రం తెరకెక్కితే అది కచ్చితంగా సూపర్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: