ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ఫ్యామిలీ  లకు చెందిన అభిమానులు తమ తమ ఫేవరెట్ హీరోలు  మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తే ఎంత బాగుండు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు, ఇలా తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది కొంతమంది హీరోలు కలిసి నటిస్తే బాగుండు అని ఉంటుంది. ముఖ్యంగా నందమూరి అభిమానులకు అయితే మల్టీస్టారర్ సినిమా కోసం ఎంతగానో నిరీక్షణ ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. 

 


 ఎందుకంటే ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్  నందమూరి బాలకృష్ణ హీరోగా కొనసాగుతున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా స్టార్ హీరోలు గానే  కొనసాగుతున్నారు. ఈ ముగ్గురికి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఈ ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు హీరోలకు మాస్ ఫాలోయింగ్  ఒక రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే. 

 

 అందుకే ఈ ముగ్గురు హీరోల కలిసి మల్టీస్టారర్ సినిమా  నందమూరి అభిమానులు అందరికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి నందమూరి అభిమానులు అందరూ ఈ ముగ్గురు హీరోల కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా నిరీక్షణ గా ఎదురు చూస్తున్నారు. అయితే అటు ఈ  ముగ్గురు హీరోలు కూడా ఒక వేళ స్క్రిప్ట్ మంచిది వస్తే తమ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు   హీరోలం  కలిసి నటించడానికి ఏం అభ్యంతరం లేదు అని నందమూరి హీరోలు చెబుతున్నారు. మరి ఆ స్క్రిప్టు ఎప్పుడు వస్తుంది నందమూరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: