మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఒక్క మల్టీ స్టారర్ కూడా రాలేదు అన్న విషయం తెలిసిందే. అయితే మెగా అభిమానులు మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ సినిమా వస్తుందేమో అని ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులందరూ దశాబ్ద కాలం నుంచి ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. 

 

 ఎందుకంటే అన్నచాటు  తమ్ముడిగా పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చి  ఆ తర్వాత  పవర్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న... అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి  చిరంజీవి పట్ల అమితమైన ప్రేమ గౌరవం ఉంటుంది. మామూలుగానే వీరిద్దరూ కలిసి ఏదైనా ఈవెంట్ లో కనిపించారు అంటే మెగా అభిమానులందరూ మురిసిపోతూ ఉంటారు. ఈలలు గోలలతో హోరెత్తి పోతూ ఉంటారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ మల్టీస్టారర్ సినిమా వచ్చిందంటే మెగా అభిమానులందరికీ పండగ అని చెప్పాలి. 

 

 అయితే దాదాపు దశాబ్ద కాలం నుంచి మెగా అభిమానులు పవర్ స్టార్,  మెగా స్టార్ కాంబినేషన్  లో మల్టీస్టారర్ సినిమా కోసం ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మెగా అభిమానులందరికీ ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అయితే కేవలం మెగా అభిమానులే కాదు పవన్ కళ్యాణ్ చిరంజీవి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కితే  అటు తెలుగు ప్రేక్షకులందరికీ ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి.మరి  మెగా అభిమానుల కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: