ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరో గా ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని  ఈ స్టార్ హీరోలు  గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాదాపుగా అరడజనుకు పైగా హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఎవరికి వారు తమ నటనతో తమదైన ఆటిట్యూడ్తో ఆకట్టుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో ఎంతగానో గుర్తింపు సంపాదించారు.అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క మల్టీస్టారర్ సినిమా కూడా రాలేదు. 

 


 అయితే అటు తెలుగు ప్రేక్షకులందరూ మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ సినిమా వస్తే బాగుండు అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా వస్తే ఇక మెగా అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాల్లో  వీరిద్దరి ఆటిట్యూడ్ కూడా కాస్త సేమ్ గానే ఉంటుంది అని అనుకుంటారు మెగా అభిమానులు. 

 


 అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వస్తే ఆ సినిమాకి స్టోరీ ఎలా ఉంటుంది...  ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోతుంది. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా వచ్చింది అంటే అది మెగా అభిమానులకే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరి మెగా అభిమానులు ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: