ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగి పోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడైతే చాలా తక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి కానీ ప్రస్తుతం సంవత్సరానికి కనీసం రెండు మూడు అయినా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. కొంతమంది హీరోలు ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా మారి పోతుంటే...కొన్ని  సినిమాల్లో  ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు. ఇలా మల్టీస్టారర్ ఏదైనా తెలుగు చిత్ర పరిశ్రమలోని అభిమానులందరినీ తెగ అలరిస్తుంది అని చెప్పారు. ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అయితే మల్టీస్టారర్ల సినిమాల హవా  మరింత పెరిగిపోయింది. 

 


 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో  మల్టీస్టారర్ సినిమాలు చేసినప్పటికీ... అభిమానులకు మాత్రం కొంతమంది హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో అభిమానులు ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా విజయ్ దేవరకొండ జూనియర్ ఎన్టీఆర్ సినిమా. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటనతో మెప్పిపిస్తాడు. 

 

 అదే సమయంలో యువ హీరో విజయ్ దేవరకొండ తనదైన ఆటిట్యూడ్ తో డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. ఇక వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా ఎంతో బాగుంటుంది.  అందుకే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే చూడాల ని తెలుగు ప్రేక్షకులంద రూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వీరిద్ద రూ మల్టీస్టారర్ సినిమా ల్లో నటించారు అంటే అభిమానులకు అని చెప్పాలి. మరి అభిమాను లు ఎదురు చూస్తున్నట్లుగా వీరిద్దరి మల్టీస్టారర్ సినిమా కోరిక  ఎప్పుడు తీరుతుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: