మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో ఆ సినిమా నిర్మాత రామ్ చరణ్ కి నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాతో పాటు మలయాళంలో హిట్టయిన లూసిఫర్ సినిమా రీమేక్ ని తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. మంచి కథ నేపథ్యం తో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్టయిన లూసిఫర్ సినిమా కచ్చితంగా తెలుగులో సూపర్ హిట్ అవుతుందని చిరంజీవి భావిస్తున్నాడు. 


అయితే ఈ సినిమాకి సాహో చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి అనేకమైన అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని తెలుగు లూసిఫర్ రీమేక్ సినిమాలో నటిస్తోందని ఒక వార్త తెగ చక్కెర్లు కొడుతుంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే డైరెక్టర్ సుజిత్ సాహో చిత్రంలో చేసిన తప్పులను మళ్ళీ చిరంజీవి సినిమాలో పునరావృతం చేస్తున్నట్టే. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే చిరంజీవి సోదరి పాత్రలో నటించేందుకు సినీ బృందం అలనాటి హీరోయిన్ సుహాసినిని సంప్రదించారట. ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో కథానాయకుడు మోహన్ లాల్ కి సోదరి పాత్రలో మంజు వారియర్ నటించింది. ఈ సినిమాలో మంజు వారియర్ ఒక యుక్తవయసు అమ్మాయికి తల్లి పాత్రలో నటించింది. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ మంజు వారియర్ ని ద్వితీయ వివాహం చేసుకుంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ పాత్రలో 40 నుండి 50 ఏళ్ళ వయసున్న నటీమణి మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతుందని అర్థమవుతుంది. 


కానీ సుహాసిని కి దాదాపు 59 సంవత్సరాలు ఉన్నాయి. ఈమె చిరంజీవి సోదరి పాత్రలో నటించడం, రెండవ పెళ్లి చేసుకోవడం, ఒక యుక్తవయసు కుమార్తెకు తల్లి గా ఉండటం చూడడానికి అంతగా బాగోదు. అందుకే సుజిత్ సుహాసినిని ఎంపిక చేసుకుంటే సాహో చిత్రంలో లాగానే మళ్లీ తప్పు చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఐతే ఇది ఇప్పటివరకు ఒక అనధికార వార్త మాత్రమే కాబట్టి సుహాసినిని ఎంపిక చేసుకోవడం అనేది నిజం కాకూడదని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: