టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తో అదిరిపోయే విజయాన్ని సాధించడం అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా ఒకే చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉండగా నిజ జీవితంలో మరోసారి సూపర్ స్టార్ మహేష్ రియల్ హీరో అనిపించుకోనున్నారు.

IHG

తూర్పుగోదావరి జిల్లా తుమ్మలపల్లి కి చెందిన నెలల బిడ్డకు అరుదైన శస్త్రచికిత్స చేయించారు. నాగజ్యోతి....ప్రదీప్ దంపతులకు పుట్టిన చిన్నారికి విజయవాడలో గుండె ఆపరేషన్ జరిగింది. పుట్టుకతోనే అరుదైన గుండెజబ్బుతో పుట్టింది చిన్నారి. దీంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో… చేతిలో చిల్లిగవ్వ లేని టైములో మహేష్ బాబు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చారు. సహాయం చేయడంలో శ్రీమంతుడు లాగా మారి చిన్నారి చికిత్సకు తన వంతు సహాయం అందజేశారు.

IHG

అరుదైన గుండెజబ్బుతో చిన్నారి పుట్టిందని వైద్యులు తెలిపారు. రెండు నెలల్లో ఆపరేషన్ జరగకపోతే చిన్నారి చనిపోయే పరిస్థితి ఉందని తల్లిదండ్రులకు తెలియజేశారు. మహేష్ బాబు టీం సకాలంలో రిఫర్ చేయడంతో పాప ని కాపాడమని డాక్టర్లు తెలియజేశారు. దీంతో తమ బిడ్డ ని కాపాడిన డాక్టర్లకు మరియు మహేష్ బాబు కి జీవితాంతం రుణపడి ఉంటామని తల్లిదండ్రులు తెలియజేశారు. జీవితంలో మహేష్ గారిని మర్చిపోలేము నిజంగా ఆయన రియల్ హీరో అని తల్లిదండ్రులు కొనియాడారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: