ముందుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎందరో తొలితరం నటులు చిత్రసీమలో మంచి పేరుతో కొనసాగే వారు. ఆపై చిత్తూరు నాగయ్య వంటి వారు మన సినిమాలకు మరింత మంచి పేరు తీసుకువచ్చారు. అయితే ఆయన తరువాత తరంలో వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ అప్పటి ప్రేక్షకుల మదిని దోచి, టాలీవుడ్ ఇంట తొలితరం సూపర్ స్టార్స్ గా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలతో పాటు ఎందరో అభిమానగణాన్ని సంపాదించడం జరిగింది. ఇక వారి అనంతరం సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి వారు కొన్నేళ్లు చిత్ర సీమలో సూపర్ స్టార్స్ గా గొప్ప సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తో, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించడం జరిగింది. 

 

ఇక వారి తరం అనంతరం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి వారు కూడా హీరోలుగా గొప్ప పేరు ప్రఖ్యాతలతో పాటు ఎందరో ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఇక వారి తరం అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజ రవితేజ, ఇలా ఈ హీరోలు కూడా తమదైన ఆకట్టుకునే యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించి కోట్లాది మంది ఫ్యాన్స్ హృదయాలను గెలుచున్నారు. అయితే మొదటి నుండి హీరోల అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొద్దిపాటి పోటీ నడుస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా అది కొన్నేళ్ల క్రితం వరకు బాగానే ఉన్నా, ఇటీవల అది మరింత శృతిమించి, ఒక హీరో సినిమాపై మరొక హీరో అభిమానులు విపరీతంగా నెగటివిటీ క్రియేట్ చేయడం మొదలెట్టారు. అది మరింత శృతిమించి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద రచ్చగా మారుతోంది. 

 

కాగా ఇటీవల కొందరు సీనియర్ యాక్టర్స్, మరియు ఇతర నటులు ప్రస్తుతం హీరోలు వారి అభిమానుల గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న హీరోలకు నిజమైన అభిమానుల కన్నా, కులం పేరుతో వారిని అభిమానిస్తున్నవారు ఎక్కువగా ఉంటున్నారని, ఎవరైనా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే చాలు, ఆ హీరో కులం అభిమానులు విపరీతంగా హడావుడి చేయడం, ఒకవేళ ప్రక్క హీరో సినిమా రిలీజ్ అయి, అది బాగున్నప్పటికీ కూడా పనిగట్టుకుని దానికి నెగటివ్ పబ్లిసిటీ చేయడం ఎక్కువ అయిందని, నిజానికి హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందనే విషయం సదరు అభిమానులకు కూడా తెలిసినప్పటికి, ఈ వైరుధ్యాలు ఏంటో తమకు అర్ధం కావడం లేదని వాపోతున్నారట. ఈ విధమైన విధానానికి రాబోయే రోజుల్లో స్వస్తి పలకాలని, నిజంగా హీరోలను వారి నటన, టాలెంట్ ని బట్టి అభిమానిస్తే పర్లేదని, కానీ కేవలం కులాన్ని అభిమానంతో ముడిపెట్టి రచ్చ చేయవద్దని వారు కోరుతున్నారట.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: