కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ముంబైలోని బాంద్రాలో వున్న తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిందే. కాగా సుశాంత్ మరణం కొన్ని కోట్ల  హృదయాలను కలిచివేసింది. ఇక సుశాంత్ చివరి సారిగా నటించిన చిత్రం దిల్ బెచారా.. ఈసినిమా  థియేటర్ విడుదల లేకుండా డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదలకానుంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.
 
అయితే సుశాంత్ గుర్తుగా  హాట్ స్టార్ ఈచిత్రాన్ని వీఐపీ సబ్ స్క్రిప్షన్ వున్న వారికి మాత్రమే కాకుండా నాన్ సబ్ స్క్రైబర్స్ కు కూడా స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం కలిపించింది. హాట్ స్టార్ ఆప్ ఉంటేచాలు సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. జులై 24న ఈచిత్రాన్ని హాట్ స్టార్  స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఈవిషయాన్నికొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. 
ముఖేష్ చాబ్రా డైరెక్ట్ చేసిన ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్  నిర్మించింది.  ఈ చిత్రంలో సంజనా సంఘీ హీరోయిన్ గా నటించింది. ఇదిలావుంటే సుశాంత్ మరణం పై ముంబై పోలీసుల విచారణ కొనసాగుతూనే వుంది. అందులో భాగంగా ఇటీవల సుశాంత్ లవర్ రియా చక్రవర్తిని పోలీసులు  9గంటల పాటు విచారించగా ప్రస్తుతం అతని స్నేహితులను విచారిస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: