హీరోయిన్ కు కాస్త క్రేజ్ ఉంటే చాలు. వీళ్లు నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. థియేటర్స్ లోకి అడుగుపెట్టకపోయినా.. శాటిలైట్ రైట్స్ అమ్ముడు కాకపోయినా.. ఓటీటీ రూపంలో డబుల్ ప్రాఫిట్ వస్తోంది. కరోనా టైమ్ లో ఏయే సినిమాలు లాభపడ్డాయో తెలుసా.. 

 

గతంలో మాదిరి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత. వీకెండ్ ఎంత వచ్చింది. ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంత. అని లెక్కలేసుకునే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదు. అయితే.. ఓటీటీ రైట్స్ ఎంత తీసుకొచ్చిందన్న టాపిక్ మాత్రం ఆసక్తికరంగా మారింది. పెట్టుబడి ఎంత.. లాభం ఎంత వచ్చిందన్న లెక్కలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

 

హిందీలో పోల్చుకుంటే.. ఓటీటీలోకి వెళ్తున్న తెలుగు సినిమాలు తక్కువే అని చెప్పాలి. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ కాస్తోగొప్పో క్రేజ్ తో ఓటీటీలో రిలీజ్ అయింది. సినిమాను నాలుగు కోట్లతో నిర్మిస్తే.. ఏడున్నర కోట్లకు అమేజాన్ సొంతం చేసుకుంది. పెంగ్విన్ నెటిజన్లను ఆకట్టుకోలేకపోయినా.. పెట్టుబడికి డబుల్ వచ్చింది. ఇక తెలుగు, తమిళం శాటిలైట్ రైట్స్ డీల్ 6కోట్లకు కుదిరిందని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ అదనం. మొత్తం మీద నాలుగు కోట్ల పెంగ్విన్.. 9కోట్లకు పైగా లాభం దక్కించుకుంది. 

 

బాలీవుడ్ లో ఓటీటీ జాతర నడుస్తోంది. జాన్వీకపూర్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. కార్గిల్ యుద్ధంలో పోరాడిన తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథతో గుంజన్ సక్సేనా అనే మూవీ రూపొందింది. బడ్జెట్ 30కోట్లు అయితే.. నెట్ ఫ్లిక్స్ సంస్థ 65కోట్లకు కొనుగోలు చేసింది. పెట్టుబడికి డబుల్ రావడం.. నిర్మాత కరణ్ జోహార్ కు కలిసొచ్చింది. ఇక శాటిలైట్ రైట్స్ అమ్మాల్సి ఉంది. మొత్తం మీద 30కోట్ల ఈ బయోపిక్.. 100కోట్ల బిజినెస్ జరుపుకుంటోంది. 

 

ఓటీటీ ఆశీస్సులతో నిర్మాతలు డిజిటల్ లో రిలీజ్ కు ఇంట్రెస్ చూపిస్తున్నారు. కీర్తి సురేష్ నటిస్తున్న మరో రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ గుడ్ లక్ సఖి.. మిస్ ఇండియా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: