రాజమౌళి అంటేనే దర్శక ధీరుడు. ఆయన డేరింగ్ ఏంటన్నది బాహుబలి వన్, టూ మూవీస్ చూపించాయి. తెలుగు సినిమా స్టామినా ఏంటి, దాని మార్కెట్ ఏంటి అన్నది కూడా ఆలోచించకుండా రాజమౌళి బాహుబలి పాన్  ఇండియా లెవెల్లో తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. ఇక్కడా అక్కడా అని కాకుండా బాహుబలి ఖండాంతరాలకు వెళ్లి జెండా ఎగరేసింది.

IHG

ఇపుడు ఆర్.ఆర్.ఆర్ అంటూ అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీని కలుపుతూ ట్రూ మల్టీ స్టారర్ మూవీకి రాజమౌళి తెరలేపాడు. ఇది కూడా భారీ సాహసమే. ఈ రెండు ఫ్యామిలీలకు మాస్ లో ఉన్న ఇమేజ్ టాప్ రేంజిలో ఉంటుంది. దాన్ని మాచ్ చేయాలంటే చాలా కష్టం. కానీ  అక్కడ ఉన్నది రాజమౌళి కాబట్టి ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

IHG

 

 ఇక రాజమౌళి కాబట్టే జూనియర్ ఎన్టీయార్, రాం చరణ్ కూడా రెండేళ్ల పాటు మరే సినిమా ఊసూ ఎత్తకుండా తమ కాల్షీట్లు ఇచ్చారు. ఇపుడు ఆర్ ఆర్  ఆర్ మూవీ షూటింగ్ సగానికి పైగా అయింది. ఇకా చాలా మిగిలిఉంది. అనుకోని ఉపద్రవంలా కరోనా మహమ్మారి వచ్చిపడింది. దాంతో మూడు నెలల అతి విలువైన సమయం వ్రుధాగా పోయింది.

IHG

మరీ లేట్ చేస్తే ఈ మూవీ ఖర్చు మరింత పెరుతుంది. ఫ్లావర్ కూడా తగ్గుతుంది. దాంతో రాజమౌళి డేరింగ్ స్టెప్ మళ్ళీ వేస్తున్నాడుట. జూలై నుంచి ఈ మూవీని సెట్స్ మీద తీసుకువచ్చేందుకు రెడీ అయిపోయాడట. రాజమౌళి పూర్తిగా ప్రభుత్వం పెట్టిన షరతులు, ఇచ్చిన అనుమతుల మేరకు షూటింగ్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడుట.

IHG's character from Rajamouli's 'RRR' - The ...

ఇపుడు టాలీవుడ్ కే బాహుబలిగా రాజమౌళి కనిపిస్తున్నాడు. జక్కన్న అడుగు ముందుకువేసి షూటింగ్ స్టార్ట్ చేస్తే మిగిలిన వారు కూడా సై అంటారన్నది నిజం. మొత్తానికి ధర్శక ధీరుడిని అనిపించుకుంటున్నాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: