పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. ఆయన సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్ల బీభత్సం సృష్టిస్తాయి. అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ ఫ్లాపే అయినా అప్పటివరకు ఉన్న ఫస్ట్ డే వసూళ్ల రికార్డులను బ్రేక్ చేయగలిగింది. ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో ఆల్రెడీ సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు.

 

సినిమా సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ తో క్రిష్సినిమా కన్ ఫర్మ్ చేసుకున్నాడు. ఇక ఆయన సినిమాతో పాటుగా హరీశ్ శంకర్ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ రెండు సినిమాల గురించి బడ్జెట్, లొకేషన్స్, కాంబినేషన్స్ ఇలాంటి వాటిపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్ కూడా వెశారని.. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ వల్ల ఆ సెట్ కూడా ఉపయోగించలేని విధంగా ఉందని వార్తలు వచ్చాయి. ఈ లాక్ డౌన్ లేకపోతే వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి ఉండేది. కాని అది కూడా వాయిదా పడ్డది. 

 

ముందు వకీల్ సాబ్ రిలీజ్ కానివ్వండి బాబు మిగతా సినిమాల సంగతి తర్వాత అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ సినిమాలపై రోజుకో కొత్త వార్త వస్తుండటం వాళ్లకు కూడా చిరాకు పుట్టేలా చేసింది. అందుకే ముందు వకీల్ సాబ్ రిలీజ్ అయ్యాక మిగతా సినిమాల గురించి చెప్పండంటూ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లు తెరచుకుంటే కనీసం దసరాకి అయినా వకీల్ సాబ్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: