టిక్ టాక్ ఇపుడు అందరికీ తెలిసిందే. ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే చాలు మనమూ స్టార్లు అయిపోవచ్చు. టాలెంట్ ఉంటే వ్యూస్ కుమ్ముకుంటూ వచ్చేస్తాయి. ఇపుడు టిక్ టాక్ ఓ ప్రపంచం అయిపోయింది. ఒకరి మీద ఆధారపడకుండా, ఒక్క చాన్స్ అంటూ స్టూడియోలు పట్టి తిరగకుండా టిక్ టాక్ యాప్ ద్వారా తమ సత్తా చాటుతున్నారు.

IHG

దాంతో ప్రతిభను చూసి వారే వస్తారు. ఇపుడు అలా ఒక టిక్ టాక్ స్టార్ కి సినిమా చాన్స్ వచ్చిపడింది. ఆమె ఎవరో కాదు వర్షిణి. టిక్ టాక్ లో వర్షిణి అదుర్స్ అనిపించేలా తన వీడియో షూట్స్ తో రచ్చ చేస్తోంది. దాంతో ఆమె టాలెంట్, బ్యూటీ ఇపుడు సినిమా చాన్స్ ఇచ్చేలా  చేసిందిట.

IHG

వర్షిణి బన్నీ వాక్స్ పేరిట ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాంతో ఆమె వెంట సినిమా లోకం పడుతోంది. తెలుగు అమ్మాయిగా ఉంటూ ఇంటి దగ్గర నుంచి కదలకుండా ఒక ఆఫర్ పట్టేయడం అంటే గ్రేటే అనుకోవాలి.

IHG

ఒక అనాధ లవ్  స్టోరీ అనే చిన్న సినిమాలో ఇపుడు వర్షిణి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. నిజంగా అందం అభినయం ఉంటే అవకాశాలు మన కాళ్ళ దగ్గరకే వస్తాయనడానికి వర్షిణి ఒక ఉదాహరణ అనుకోవాలేమో. ఇపుడు వర్షిణి ఆఫర్ ని చూసి మరింత మంది టిక్ టాక్ షోలకు పదును పెడతారేమో చూడాలి

IHG

ఏది ఏమైనా టాలెంట్ కూడా పూల పరిమళం లాంటిదే అది. ఎంత దూరమైన వెళ్టుంది. దాంతో చాన్సులు కూడా వస్తాయి. మొత్తం మీద టిక్ టాక్ స్టార్  వర్షిణికి అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: