ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై భామ సమంత. ఆ సినిమాతోనే స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ క్రేజ్ దక్కించుకుంది. ఇక వరుస స్టార్స్ తో సినిమాలు చేస్తూ తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లింది సమంత. ఇక కెరియ్ర్ పీక్స్ లో ఉన్నప్పుడే చైతుతో లవ్ మ్యారేజ్ ఆమెను మరింత ప్రేక్షకులకు దగ్గర చేసింది. అక్కినేని కోడలిగా మరింత బాధ్యత మీద వేసుకున్న సమంత ఈమధ్య సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీతో హిట్ అందుకున్న ఈ భామ ఇంతవరకు ఏ సినిమాను కన్ ఫర్మ్ చేయలేదు.

 

మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సమంత నటిస్తుందని వార్తలు వచ్చినా కూడా అవేవి నిజం కాదని తెలుస్తుంది. ప్రస్తుతం సాం ఫ్యామిలీ మెన్ సీరీస్ లో సెకండ్ సీజన్ లో నటించింది. అందులో కూడా సమంత నెగటివ్ రోల్ లో నటించిందని తెలుస్తుంది. కథల విషయంలో ఇదివరకులా కాకుండా చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉండేలా చూస్తుందట. అయితే సమంత సినిమాలు కావాలనే తగ్గిస్తుందా లేక ఆమెకు ఛాన్సులు రావట్లేదా అన్న డౌట్ కూడా రేంజ్ అయ్యింది.

 

సమంత సినిమా ఉంటే అది పక్కా హిట్టే అనేంత క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు తన ఇమేజ్ కు తగినట్టుగా ఎలాంటి కథలు చేయాలన్న ఆలోచనలో పడ్డదట. అందుకే ఈమధ్య తన దగ్గరకు వచ్చిన రెండు కథలను విని నచ్చలేదని తిప్పి పంపించిందట. సమంతని దృష్టిలో ఉంచుకుని ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని అనుకుంటేనే ఆమె దగ్గరకు వెళ్తారు అలాంటిది ఆ కథలు విని సాం వెనక్కి పంపించింది అంటే తప్పకుండా సమంత ఆలోచనల్లో మార్పు వచ్చినట్టే అనిపిస్తుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో పాటుగా కోలీవుడ్ లో విఘ్నేష్ శివ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుంది సమంత. ఆ సినిమాలో నయనతార కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: