టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ యేడాది అలవైకుంఠమపురములో సినిమా తో త్రివిక్రమ్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ తో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మరోసారి బన్నీతో కూడా త్రివిక్రమ్ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

IHG

అటువంటి సమయంలో ఇటీవల త్రివిక్రమ్ రెండుమూడుసార్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా కలిసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో త్రివిక్రమ్ చాలా సినిమాలకు సంబంధించి స్క్రిప్టులు రెడీ చేసుకున్నట్లు వార్తలు రావటం మనం చూశాం. చాలా పద్ధతిగా త్రివిక్రమ్ రాసిన స్క్రిప్టులు  ఉంటాయని, చెబుతుంటారు. అంతేకాకుండా ఏ సీన్ కి ఆ సీన్ రాసుకుని లైన్ ప్రకారం ఉంచుకొనే సరిగ్గా సెట్ లో అప్పటికప్పుడు త్రివిక్రం డైలాగులు రాస్తారని ఇండస్ట్రీ లో త్రివిక్రమ్ పనితీరుపై టాక్.

IHG

ఇదిలా ఉండగా రామ్ చరణ్ తో సినిమా మ్యాగ్జిమం త్రివిక్రం కన్ఫర్మ్ చేసినట్లు… ఈ సినిమాని స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఈ పాయింట్ మీదే ఎక్కువ చర్చలు జరుపుతున్నట్లు.. అబ్బాయి సినిమాని బాబాయ్ నిర్మిస్తున్నాడు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం స్టార్ట్ అయి పోతున్నట్లే అని అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: