మళయళంలో సూపర్ హిట్టైన ప్రేమం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ సినిమాలో మలార్ పాత్రకు అమ్మడు అభినయం సౌత్ కుర్ర కారుని ఆకట్టుకుంది. చేసింది మళయాళంలోనే అయినా ఆ సినిమాతో ఆమెకు సౌత్ అంతా క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాలో భానుమతి పాత్రలో ఎంచక్కా కుదిరింది సాయి పల్లవి. అదేంటో భానుమతి పాత్ర బహుశా శేఖర్ కమ్ముల సాయి పల్లవి కోసమే రాశాడేమో అనేలా సినిమా వచ్చింది. ఇక ఫిదా ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

సినిమా తర్వాత తన అభిరుచికి తగిన సినిమాలు చేస్తూ వస్తున్న సాయి పల్లవి తనకు నచ్చని పాత్రలు మాత్రం చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. కొందరు హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఆశ చూపిస్తే కొన్ని సినిమాలు చేస్తారు సాయి పల్లవి అలాంటి ఛాన్సులు కూడా కాలదన్నుకుంది. కేవలం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ వస్తుంది. అయితే ఇలాంటి ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్న సాయి పల్లవికి కోటిన్నర రూపాయల ఆఫర్ వస్తే కాదని చెప్పింది.

 

ఓ పెద్ద స్టార్ సినిమాలో ఐదు నిమిషాల పాత్ర ఓ సాంగ్ కోసం అమ్మడిని అడిగారట. ఆమె క్రేజ్ బాగా ఉందని తెలిసి అందుకు తగినట్టుగానే కోటిన్నర దాకా రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేశారట. కాని సాయి పల్లవి మాత్రం ఆ కోటిన్నర వద్దు.. ఆ ఆఫర్ వద్దని చెప్పేసిందట. ఆడియెన్స్ లో తనకు ఉన్న ఈ ఇమేజ్ ను చెడగొట్టుకోకూడదని చూస్తుంది సాయి పల్లవి. మరి కెరియర్ మొత్తం ఇలానే సెలెక్టెడ్ సినిమాలు చేస్తుందా లేక మధ్యలో డబ్బుకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఏ సినిమా అయినా చేస్తుందా అన్నది చూడాలి.           

మరింత సమాచారం తెలుసుకోండి: