‘బాహుబలి’ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. సౌత్ ఇండియా లోనే అతి పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమాగా rrr తెరకెక్కుతోంది. మొట్టమొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో సౌత్ ఇండస్ట్రీ లో మాత్రమే కాక యావత్ ఇండియాలోనే సినిమాపై మంచి ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా 'RRR' తరహాలోనే మరొకటి భారీ మల్టీస్టారర్ సినిమా సెట్స్ మీదకి రావాలని సోషల్ మీడియాలో నెటిజన్లు, టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కోరుతున్నరు.

IHG't stop laughing in this ...

మహేష్ బాబు మరియు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే అదిరిపోతుందని ఆ తరహాలో డైరెక్టర్ వర్క్ చేసే వాడు ఉంటే ఇంకా బాగుంటుందని పేర్కొంటున్నారు. వీళ్ల ముగ్గురి మధ్య మంచి స్నేహం ఉండటం తో చాలా ఈజీ గా ఉంటుందని, కమర్షియల్ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ తరహాలో సినిమా తీస్తే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వే టైమింగ్ ఈ ముగ్గురి నటన లో ఉంటుందని సినీ ప్రేక్షకులు అంటున్నారు.

IHG

ఆల్రెడీ ఈ ముగ్గురు సినిమా చేద్దామని ప్లానింగ్ లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కుదిరితే అది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే చాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న టాక్. ఇండస్ట్రీలో ఈ ముగ్గురు హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం సంబంధం ఉండటంతోపాటు ఎప్పటికప్పుడు పార్టీలలో కలుసు కుంటూ ఒకరితో ఒకరు స్నేహపూర్వక వాతావరణం ఉండటంతో మ్యాగ్జిమం ఈ ప్రాజెక్టు ఓకే అయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: