నందమూరి బాలకృష్ణ కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి. ఆయన వందో సినిమా గా వచ్చిన ఆ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న బాలయ్య ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేసారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు బాలయ్య ను కమర్షియల్ హీరో గా కూడా మార్చింది అని అంటారు సినీ పరిశేలకులు. ఇక అక్కడి నుంచి ఆయన వరుసగా సినిమాలను కమర్షియల్ కోణం లోనే చేస్తూ వచ్చారు అని చెప్పాలి. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య రేంజ్ ఇంకా పెరిగింది అని అంటారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన... శ్రేయ కొన్ని కొన్ని సన్నివేశాల్లో అయితే చాలా బాగా నటించింది అనే పేరు వచ్చింది. ఆమె సినిమా మొదట్లో బాలయ్య తో రోమాన్స్ చేసే సమయంల్... పిల్లాడు పాల కోసం ఏడుస్తూ ఉన్న సమయంలో వెళ్లి పాలు ఇస్తుంది. ఆ సీన్ లో బాలయ్య... ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ కి కూడా మంచి స్పందన వచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అలాంటి కథలతో సినిమాలు చెయ్యాలి అని ఎదురు చూసినా సరే అది సాధ్యం కాలేదు. 

 

ఈ సినిమాలో బాలయ్య నటన కు అవార్డ్ లు కూడా వచ్చాయి. యుద్ద వీరుడి గా ఆయన నటన చాలా మందికి నచ్చింది అనే చెప్పాలి. అదే విధంగా ఈ సినిమా దర్శకుడు క్రిష్ కూడా స్థాయికి తగిన విధంగా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: