చిరంజీవి కెరీర్ లో ఒక రేంజ్ లో హిట్ అయిన సినిమా అతిలోక సుందరి జగదేక వీరుడు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మరవలేని విజయం సాధించింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన నటన తో పాటుగా హీరోయిన్ గా నటించిన శ్రీదేవి నటన అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఇద్దరూ కూడా ఈ సినిమాలో జీవించారు అని సినిమా చూసిన ఎవరు అయినా సరే ఒక్క మాట కూడా ఆలోచన లేకుండా చెప్తారు. ఈ సినిమాలో చిరంజీవి కాకుండా మరో హీరో అయి ఉంటే ఆ స్థాయిలో ఆ సన్నివేశం వచ్చి ఉండేది కాదు అని చాలా మంది అంటారు. 

 

ఇక ఈ సినిమా లో శ్రీదేవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానవా అంటూ ఆమె పై నుంచి కిందకు వచ్చిన సమయంలో చేసిన ఒక సన్నివేశం చాలా బాగా ఆకట్టుకుంది టాలీవుడ్ ని అని చెప్పాలి. ఆమె మినహా ఎవరూ కూడా ఆ సన్నివేశంలో ఆ స్థాయిలో చేయలేరు అనే విధంగా ఆమె చేసింది అని చెప్పాలి. తన స్థాయి లో ఆమె నటించగా ఆమెకు ఆ సినిమాలో చాలా అవార్డ్ లు వచ్చాయి. అదే విధంగా అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలతో ఆమె ఆడుకునే సమయంలో ఆమె చేసిన నటన చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

ఇక ఆ సినిమా మొత్తం కూడా ఆమె హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయి అనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఆమె కెరీర్ లో మరింతగా దూసుకుపోయింది. ఆమె కెరీర్ లో అతి పెద్ద విజయాల్లో ఆ సినిమాను కూడా ప్రస్తావిస్తుంది టాలీవుడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: