ఒక్క టాలీవుడ్ నే కాదు...  ఇండియన్ సినిమాలో కూడా సూపర్ హిట్ అయిన సినిమా దేవత. ఈ సినిమా సాధించిన విజయం ఈ సినిమాకు వచ్చిన అవార్డ్ ల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ లు గా నటించిన జయప్రద, శ్రీదేవి అయితే సినిమా రేంజ్ ని మరో రేంజ్ కి తీసుకుని వెళ్ళారు. ఇద్దరూ కూడా నటనలో ఈ సినిమాలో తమ స్థాయికి తగిన విధంగా నటించారు అనే చెప్పాలి. ఇక శ్రీదేవి అయితే ఈ సినిమాలో జీవించింది అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఆమె మినహా ఆ పాత్రలో ఎవరూ కూడా చేయలేరు అనే విధంగా ఆమె చేసారు. 

 

శోభన్ బాబు ని జయప్రద శ్రీదేవి ఇద్దరూ ప్రేమిస్తారు.  శ్రీదేవి సొంత అక్క జయప్రద. ఆమె కోసం జీవితం మొత్తం కూడా త్యాగం చేస్తుంది. ఇక అందుకే ప్రేమించిన వాడిని దూరం చేయడం ఇష్టం లేని శ్రీదేవి ఒక ప్లాన్ వేస్తుంది. ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నాం అనే విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు. మంచం మీద పడుకుని అటు ఇటు తిరిగి చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తాను ప్రేమించింది లాయర్ బాబు ని జయప్రద చెప్పగానే శ్రీదేవి జీవించింది. ఆ స్థాయిలో ఆమె ఆ సన్నివేశం లో కనపడింది. తన అక్క కోసం ప్రేమించిన వాడిని వదులుకోవాలి అనుకుంటుంది. 

 

ఎవరికి చెప్పకుండా వెళ్లి మోహన్ బాబు ని వివాహం చేసుకుంటుంది. ఇక ఆ సీన్ సినిమాలోనే హైలెట్ గా నిలిచింది. ఈ పని ఎందుకు చేశావమ్మా అంటూ ఆమెను చాలా మంది నిలదీస్తూ ఉంటారు. ఇక ఆ సినిమా తర్వాత శ్రీదేవి జయప్రద స్థాయి మరో రేంజ్ కి వెళ్ళింది అని చెప్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: