మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమాలు అగ్ర హీరోల సినిమాలు. ఆ సినిమాలు ఎప్పుడు టీవీ లో వచ్చినా లేదా ఆ సినిమాలు ఎప్పుడు చూడాలని భావించినా సరే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా పవిత్ర బంధం. ఈ తరానికి పెద్దగా ఈ సినిమా గురించి తెలియదు  ఏమో గాని కిందటి తరం అయితే ఈ సినిమాను ఎప్పుడు టీవీ లో వచ్చినా సరే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. ఈ సినిమా ను సీడీ లు వేసుకుని యుట్యూబ్ లో కూడా చూసే  ప్రయత్నం చేస్తారు. 

 

ఈ సినిమాలో వెంకటేష్ నటన సౌందర్య నటన అన్నీ కూడా చాలా బాగా నచ్చుతూ ఉంటాయి జనాలకు. ఈ సినిమా తర్వాత సౌందర్య రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో ఆమె కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా అందంగా నటిస్తుంది. ప్రధానంగా చెప్పుకునే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటీ అంటే అపురూపమైనదమ్మ ఆడ జన్మ అనే పాటలో సౌందర్య చాలా అందంగా నటిస్తారు. భర్త మీద ఆమె చూపించే ప్రేమ భర్తకు ఆమె చేసే సేవలు అన్నీ కూడా సినిమాలో చాలా అందంగా చూపిస్తారు. ఆ పాటలోనే ఎక్కువగా ఉంటాయి. 

 

భర్తను ఒక భార్య ఎంత ప్రేమ గా చూసుకోవాలి అనేది ఆ సీన్ లో ఆ పాట లో చూపిస్తారు. ఇక భార్య ముందు భర్త అహం ఉండకూడదు దానిని చూపించడం మంచి పద్ధతి కాదు అని నిరూపించే సన్నివేశంగా దానిని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ పాత్రలు ఆమెకు బాగానే వచ్చాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: