బాజీరావు మస్తాని... ఇండియన్ సినిమాలో ఒక సంచలనం. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల నటన నుంచి ప్రతీ ఒక్కరి నటన ఒక చారిత్రాత్మక  కథను అందంగా చూపించిన విధానం ప్రతీ ఒక్కటి కూడా సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి సినిమాను చూపించిన విధానం సినిమాలో ప్రతీ సీన్ ని ఆయన మలిచిన విధానం అన్నీ కూడా హైలెట్. అప్పటి వరకు ఆ రేంజ్ లో రణవీర్ సింగ్ ని గాని దీపిక ని గాని ప్రియాంక్ ను గాను  మరో నటీ నటులను గాని చూపించవచ్చు అని ఎవరికి అర్ధం కాలేదు. 

 

ఆ రేంజ్ లో ప్రతీ సీన్ లో చాలా బాగా చూపించారు అనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో దీపిక పదుకునే నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది సినిమా చూసిన ఎవరిని అయినా సరే. ప్రధానంగా ఆమె నటన సినిమాలో హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. రణవీర్ సింగ్ ని ఆమె తన రాజ్యం కాపాడాలి అని కోరుతుంది. ఆ సమయంలో ఆమె చేసిన యుద్ధం అదే విధంగా డైలాగులు చెప్పిన తీరు సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. ఇక అది పక్కన పెడితే... రణవీర్ ని ఆమె వివాహం చేసుకుని ఆమె పూణే వచ్చిన సమయంలో రణవీర్ భార్య నుంచి అక్కడి వారు ఆమెను పెట్టే బాధల నుంచి ఆమె బయటకు వచ్చిన తీరు, 

 

ఏ విధంగా అయినా సరే రణవీర్ సింగ్ కావాలి అని ఆమె భావించి వారి అవమానాలను మోసిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. ఇక పూజ సమయంలో తనను చంపడానికి అక్కడ ఉన్న సైనికులు వస్తే ఆమె తన కొడుకుని కాపాడుకోవడానికి చేసిన యుద్ధం హైలెట్.

మరింత సమాచారం తెలుసుకోండి: