విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో గురు ఒకటి. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. వెంకటేష్ కి వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రితికా సింగ్ నటన ఒక హైలెట్ అయితే వెంకటేష్ నటన మరో హైలెట్ గా చెప్పుకోవచ్చు. వెంకటేష్ ఈ సినిమాలో బాక్సింగ్... కోచ్ గా  నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ఈ సినిమాలో  హీరోయిన్ గా నటించిన రితిక సింగ్ నటన హైలెట్. 

 

ఆమె బాక్సింగ్ లో జాయిన్ అయ్యే సమయంలో నటించిన కొన్ని సీన్ లు అదే విధంగా క్లైమాక్స్ సీన్ లో ఆమె చేసిన ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. క్లైమాక్స్ సీన్ లో ఆమె ఫైట్ గెలిచిన తర్వాత... పరుగులు తీస్తూ వెంకటేష్ మీద ఆమె దూకుతూ ఆయనను హగ్ చేసుకుంటుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఆ సీన్ లో ఆమె మినహా ఎవరూ చేయలేరు అనే విధంగా చేసి చూపించింది ఆమె. ఇక ఆ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకునే సన్నివేశాల్లో కూడా ఆమె చాలా బాగా నటించి మెప్పించింది. 

 

వెంకటేష్ లాంటి నటుడి పక్కన అయినా సరే ఆమె ఏ మాత్రం ఇబ్బంది  పడకుండా నటించింది అని చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా... ఆమె చాలా  బాగా మెప్పించింది. ఫైట్ ట్రైనింగ్ సీన్స్ లో కూడా ఆమె ఏ మాత్రం ఇబ్బంది పడకుండా నటించింది. రియల్ లైఫ్ లో బాక్సింగ్ చేసే ఆమె ఈ సినిమాలో జీవించింది. అక్కడి నుంచి  ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: