నిత్యా మీనన్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో... మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా. ఈ సినిమా నిత్యా మీనన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె చాలా అందంగా నటించింది. శర్వానంద్... హీరో గా వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె కొన్ని  కొన్ని సన్నివేశాల్లో చాలా అందంగా నటించింది అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్తారు. ఆమె మినహా ఎవరూ కూడా చేయలేరు అనే విధంగా చేసింది. ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఆమె  ఒక కుమార్తె ను పెంచుకుంటుంది. 

 

ఇక పెంచుకున్న కుమార్తె తల్లి ని ఒక సందర్భం లో నిలదీస్తుంది. ఆ సమయంలో ఆమె ప్రేమ గురించి చెప్పడమే కాకుండా సెక్స్ ఈజ్ ఎన్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటూ ఒక చిన్న మాట చెప్తుంది. ఆ సీన్ లో ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఆమె కనపడిన విధానం అన్నీ కూడా సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. ఇక శర్వా ఇంటికి వచ్చిన సమయంలో అతని తల్లి అయిన పవిత్రా లోకేష్ వద్ద కూడా ఆమె చాలా అందంగా నటిస్తుంది. అలా ఆ సినిమాలో ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. 

 

సినిమా తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో మంచి పాత్రలు ఉంటే ముందు ఆమెను అడుగుతున్నారు.  దానికి కారణం ఆమె నటన లో ఉన్న స్థాయి. ఆ విధంగా వచ్చిన పాత్రలే జనతా గ్యారేజ్ లో ఆమె చేసిన ఒక పాత్ర. అలా సినిమాలలో ఆమె చాలా అందంగా నటిస్తుంది అనే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: