మహానటి... కీర్తి సురేష్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో చేసిన  కీర్తి సురేష్ నటన చూసి టాలీవుడ్ షేక్ అయింది. ఆ రేంజ్ లో ఆమె నటించింది. ఈ తరం లో ఉన్న ప్రేక్షకులు చాలా మందికి కీర్తి సురేష్ మహానటి అనే విధంగా నటించింది అంటే ఆమె ఏ స్థాయిలో చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఆమె మినహా ఎవరూ కూడా చేయలేరు ఆ పాత్రలో అనే విధంగా ఆమె నటించారు అని చెప్పాలి. ఈ సినిమాలో ఆమెకు నటిగా మంచి పేరు వచ్చింది. 

 

ఇక ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాల గురించి కీర్తి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అవి ఏంటీ అంటే... ఆమె చెన్నై లో అవకాశాల కోసం వెళ్తుంది. ఆ సమయంలో ఆమె విజయ వాహిని స్టూడియో లో అడుగు పెట్టిన సమయంలో చేసిన నటన సినిమాకే హైలెట్. ఆమె నడక చూసి చాలా మంది ఎంత అందంగా ఉందో కీర్తి అంటూ కామెంట్స్ చేసారు. ఇక మొదటి సీన్ లో... ఆమె  కన్నీళ్లు కారుస్తుంది. ఆ సన్నివేశంలో ఆమె సావిత్రిని మరిపించింది అని చెప్తారు. అదే విధంగా అహనా పెళ్ళంట పాట లో ఆమె కనపడిన విధానం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

ఆ సీన్ లో ఆమె చాలా బాగా నటించి మెప్పించింది. ఇక జెమిని గణేషన్ ని వివాహం చేసుకునే సమయంలో కూడా ఆమె చాలా బాగా నటించింది అనే చెప్పాలి. వివాహం చేసుకునే సమయంలో ఆమె హావ భావాలు అన్నీ కూడా ప్రేక్షకులను అలా చూస్తుండిపోయే విధంగా చేసాయి అని చెప్పాలి. ఆ సినిమాలో ఆమె మినహా ఎవరూ చేయలేరు అనే విధంగా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: