ఆరడుగుల అందం, మొహంలో ఉట్టిపడే రాజసం, బాణాల్లాగా దూసుకెళ్లే మాటలు కలగలిపితే వచ్చే రూపమే అనుష్క శెట్టి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మహారాణి క్యారెక్టర్లకు బాగా సూట్ అయ్యే అనుష్క శెట్టి హీరోయిన్ ప్రాధాన్యత గల పలు సినిమాల్లో నటించింది. భాగమతి, రుద్రమ్మదేవి అరుంధతి వంటి సినిమాల్లో ఆమె బ్రహ్మాండంగా నటించి ప్రేక్షకులను చూరగొన్నది. ముఖ్యంగా 2009వ సంవత్సరంలో విడుదలైన అరుంధతి సినిమాలో జేజెమ్మ, అరుంధతి పాత్రలలో ఆమె నటనకు తెలుగు సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులయ్యారు. ఈ రెండు పాత్రల్లో ఆమెని తప్ప మరేతర నటీమణి ని ప్రేక్షకులు ఊహించకోలేకపోయారు. 


ఈ థ్రిల్లింగ్ హారర్ మూవీ కి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా... చింతపల్లి రమణ కథను అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీత బాణీలను అందించారు. రాహుల్ నంబియార్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నాయ్ అని చెప్పుకోవచ్చు. పశుపతి పాత్రలో నటించిన సోనూసూద్ కి రవి శంకర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా... వీళ్ళిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను కనువిందు చేసింది. వదల బొమ్మాలి వదల అని సోనూసూద్ చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఈలలు వేశారు అంటే అతిశయోక్తి కాదు. 


జేజమ్మ చేత పశుపతి రాజా భవంతిలో సజీవ సమాధి చేయబడతాడు. చనిపోయినప్పటికీ పశుపతి ప్రేతాత్మ గద్వాల్ ప్రజలను పట్టి పీడిస్తుంది. ఈ క్రమంలోనే అరుంధతి గద్వాల్ సిటీ లో అడుగుపెడుతోంది. దీంతో పశుపతి ప్రేతాత్మ అరుంధతి ని తన వద్దకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటుంది. ఒకరోజు కాబోయే భర్త రాహుల్ ఫోన్ చేసినట్టు చేసి అరుంధతి ని తన వద్దకు తీసుకువస్తాడు పశుపతి. పశుపతి ఆమెను చూడగానే 'రా... రా... రాకపోతే చచ్చిపోతావ్' అనగానే... అరుంధతి లో జేజమ్మ ఆవహించి నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటూ సూపర్ డైలాగ్ వదులుతుంది. 


ఈ సన్నివేశం ప్రేక్షకులను బాగా భయ పెట్టిందని చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్... కోటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్... రవిశంకర్ భయంకరమైన వాయిస్... అరుంధతి నటన ఈ సన్నివేశాన్ని ఎప్పటికీ మరిచిపోలేనిది గా చేసాయి. నువ్వు నన్ను ఏం చేయలేవురా అని చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్టులు కీలకమైన పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ సినిమాలోని డైలాగులు హిట్ అయినందుకు విలన్ కి, హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: