నేషనల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమా గురించి ఇంతవరకూ ఎలాంటి అప్దేట్ రాలేదు. సాహో సినిమా రిలీజ్ కి ముందే స్టార్ట్ అయిన 20వ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుంది. డియర్ కామ్రేడ్ చిత్రానికి మ్యూజిక్ అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడని వార్తలు వచ్చాయి.

IHG

పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క్లాసికల్ డాన్స్ టీచర్ గా కనిపిస్తుందని అన్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలే. ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. కనీసం సినిమా టైటిల్ అయినా ప్రకటించాలమ్టూ ఫ్యాన్స్ ఎంతో గోల చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికతా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. అయినా కూడా యూవీ క్రియేషన్స్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

IHG

ప్రస్తుతం అభిమానుల గోల కూడా తగ్గింది. అదీగాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో షూటింగులకి అనుమతులు వచ్చాయి. దాంతో ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే భారీ సెట్ నిర్మించనున్నారట. యూరప్ లో జరగాల్సిన సన్నివేశాలన్నీ ఇక్కడే కానిచ్చేస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఇప్పట్లో అప్డేట్ వచ్చేలా కనబడట్లేదు.

 

 

 

మరో నాలుగు నెలలు ఆగితే అక్టోబర్ వస్తుంది. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమాపై ఏదైన అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. సినిమా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే| బాగుంటుందని ఫీల్ అవుతున్నారట. మరి అప్పటిదాకా ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తారా లేదా చూడాలి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: