చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వచ్చి  పోవడం కాదు పాతుకు పోతుంటారు. ఇలా కొంతమంది హీరోయిన్లు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తమ అందచందాలతో తమ చిలిపి నవ్వుతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా దశాబ్ద కాలం నుంచీ తన హవా నడిపిస్తూ ఇప్పటికికూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న హీరోయిన్ సమంత. అక్కినేని కోడలు గా మారిన తరువాత ఈ అమ్మడి సక్సెస్ రేట్ ను మరింత పెరిగిందనే చెప్పాలి. పెళ్లి తర్వాత కూడా వరుస  సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. 

 


 అయితే సమంత ఇప్పటివరకు దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించింది. అయితే సమంతా ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ సమంత చెప్పిన ప్రతి డైలాగు కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటుంది. ముఖ్యంగా హస్కీ వాయిస్ తో సమంత చెప్పే డైలాగులు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తాయి. అయితే సమంత ఎన్ని డైలాగులు చెప్పినప్పటికీ కొన్ని డైలాగులు మాత్రం తెలుగు మనస్సులో చిరస్థాయి గా నిలిచిపోయిన ఉంటాయి. ఇక ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా ఆ డైలాగులను పలు సందర్భాలలో వాడుతూ ఉంటారు. 

 


 ఇలా ఒక్క డైలాగ్ తో సమంత మంచి క్రేజ్ తెచ్చుకున్న డైలాగ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఐ  హార్ట్ ఫీల్ అయ్యాను బుంగమూతి పెట్టాను అని చెప్పిన డైలాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయి పోయింది. ఈ ఒక్క  డైలాగ్ సమంతకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం  ప్రేమికుల మధ్య ఇలాంటి డైలాగ్ వస్తూనే ఉంటుంది. తమ బాయ్ ఫ్రెండ్ మీద అలిగిన  వాళ్ళందరూ ఇలా సినిమాలో సమంత చెప్పిన డైలాగులు చెబుతూ అలుగుతూ ఉంటారు. ఇలా ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: