చిత్ర పరిశ్రమలో ఎవరు ఎవరితో ఎక్కువ రోజులు ఉంటారో ఎవరికి తెలీదు. అయితే తాజాగా హాలీవుడ్ చిత్రం మ్యాడ్ మెన్ యాక్టర్ జాన్ హమ్ డేటింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికిన ఆయన తాజాగా తోటి హీరోయిన్‌ అననా అస్కియోలాతో అఫైర్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయంఇప్పుడు మీడియాలో హైలెట్‌గా మారిందన్నారు.

 


గతంలో జాన్ హామ్ జెన్నిఫర్ వెస్ట్‌ఫెల్డ్‌తో సహజీవనం చేసిన విషయం తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల సహజీవనం తర్వాత వారిద్దరూ విడిపోవడం హాలీవుడ్‌లో సంచలనం రేపిందన్నారు. తాము ఇద్దరు విడిపోవడం బాధగానే ఉందన్నారు. కానీ వ్యక్తిగత విభేదాలు మమల్ని కలిసి ఉండేలా చేయడం లేదన్నారు. అందుకే విడిపోతున్నాం అని జాన్, జెన్నీఫర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

 

 

జాన్, జెన్నీఫర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో.. 18 ఏళ్ల ప్రేమ, సహజీవనం తర్వాత విడిపోవాలని డిసైడ్ చేసుకొన్నాం. మేము విడిపోవడం మాకు విషాదమే. రాబోయే రోజుల్లో స్నేహంగా ఉంటూనే.. మేమిద్దరం ఒకరికొకరం పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించుకొన్నాం అని తమ సపరేషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

 

 

జెన్నీఫర్‌తో విడిపోయిన వెంటనే అన్నాతో అఫైర్ మొదలు పెట్టారు. మ్యాడ్ మెన్ ఫైనల్ సీజన్‌ పూర్తికాగానే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే అన్నా కారణంగానే జెన్నీఫర్‌ నుంచి విడిపోయారనే వార్తలు వచ్చాయి. అయినా జాన్ అవేమీ పట్టించుకోకుండా అన్నాతో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించారు.

 

 

అమెరికాలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ జాన్, అన్నా ఇద్దరు జాలీగా కాలాన్ని గడిపేస్తున్నారు. ఇటీవల టెన్నిస్ మ్యాచ్‌ను చూస్తూ ఓ చోట కనిపించారు. మాస్కులు, సన్ గ్లాసెస్ ధరించి లాస్ ఎంజెలెస్ టెన్నిస్ కోర్టులో సాధారణ దుస్తుల్లో రొమాంటిక్‌గా కనిపించారు. ఆ మరుసటి రోజే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తూ ఓ షాపింగ్ మాల్ మీడియా కంటపడ్డారు. పలుమార్లు అన్నా షాపింగ్‌లో బిజీగా ఉంటే జాన్ కారులో వేచి ఉండటం మీడియా దృష్టిని ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: