ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని టాలీవుడ్ లో చాలా మంది దాని వైపు అడుగులు వేస్తున్నారు. అగ్ర హీరోలు చిన్న హీరోలు అందరూ కూడా ఓటీటీ గురించే ఆలోచిస్తున్నారు. ఓటీటీ లో సినిమాలు చేయడం లేదా వెబ్ సీరీస్ లు చేయడం ఇలాగే ఆలోచిస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో ఓటీటీ లో వస్తాయి అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఓటీటీ లో సినిమాలకు మంచి ఆదరణ వస్తు ఉండటం జనాలు ఇళ్ళల్లో ఎక్కువగా ఉండటంతో చిన్న దర్శకులు పెద్ద దర్శకులు కూడా ఓటీటీ లో సినిమాలను విడుదల చేసే ప్లాన్ చేయడంతో పాటుగా... 

 

వెబ్ సీరీస్ ల మీద కూడా బాగానే ఫోకస్ చేసారు. ఇప్పుడు చాలా మంది తమిళం  తెలుగులో ఓటీటీ లోనే సినిమాలను వెబ్ సీరీస్ లను ప్లాన్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో అగ్ర  దర్శకుడు అయిపోయిన అనీల్ రావిపూడి అయితే ఇప్పుడు వెబ్ సీరీస్ చేస్తే మంచిది అనే ఆలోచనలో ఉన్నాడు అని టాక్. అతను ఇప్పుడు ఒక వెబ్ సీరీస్ ని ప్లాన్ చేస్తున్నాడు అని ఆహా యాప్ లో దీనిని విడుదల చెయ్యాలి అని భావిస్తున్నాడు అని టాక్.  ఇప్పుడు రాబోయే రెండు మూడు నెలలు తాను ఖాళీ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసాడట. 

 

కొత్త నటీ నటులను తీసుకుని ఈ సీరీస్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. రెండు మూడు నెలల్లో దీనిని మొదటి పార్ట్ ని విడుదల చేస్తారు అని అంటున్నారు మరి. ఈ వెబ్ సీరీస్ తర్వాత అతను ఎఫ్ 3 సినిమా చేసే అవకాశం ఉంది అని టాక్. మరి ఎప్పుడు దానిని చేస్తాడు అనేది చూడాలి. అతని చేతిలో రామ్ చరణ్ సినిమా కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: