మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లోనూ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది త‌మ‌న్నా. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. గెస్ట్ రెల్స్‌, ఐటెం సాంగ్స్‌లోనూ మెరుస్తుంది ఈ బ్యూటీ. అయితే త‌మ‌న్నా కెరీర్‌లో బెస్ట్ సినిమాల లిస్ట్‌లో 100% లవ్ సినిమా కూడా ఒక‌టి. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించారు. మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ.

IHG

100% లవ్ చిత్రంతో చైతన్య బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన కెరీర్ లో ఏమాయ చేశావే ఒక తరహా లవ్ స్టోరి అయితే 100% లవ్ ఇంకో తరహా అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మహాలక్ష్మిగా దర్శనమిచ్చింది తమన్నా భాటియా. పల్లెటూరి అమ్మాయిగా నగరానికి వచ్చి బావ మీద కోపం, ప్రేమతో బాగా చదువుకుని తానెంటో నిరూపించే వ్యక్తిత్వం ఉన్న పాత్ర ఇది. అయితే ఈ సినిమాలో తన గొప్పను చెప్పుకున్నప్పుడల్లా ‘దటీజ్ మహాలక్ష్మి’ అంటూ త‌మ‌న్నా యూత్‌ను ఫిదా చేసింద‌నే చెప్పాలి. 

IHG

త‌మ‌న్నా ఆ డైలాగ్ చెప్పేట‌ప్పుడు.. రెండు సార్లు ఆమె మాయలో పడిన ప్రేక్షకుడు మూడోసారి ఆమెతోపాటు గొంతు కలుపుతాడు. అంత‌లా ఆ డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించింది. ఇక చివ‌ర‌కు అనుకున్నది సాధించి అందరితో ‘దటీజ్‌ మహాలక్ష్మి’ అనిపించుకుంటుంది త‌మ‌న్నా. కాగా, కలవటం..విడిపోవటం..పొందటం అనే రెగ్యులర్ రొమాంటిక్ బీట్స్ కు అణుగుణంగానే సుకుమార్ స్క్రిప్టు తయారుచేసుకుని.. తాను కన్ఫూజ్ కాకుండా ప్రేక్షకుడ్ని కన్ఫూజ్ కాకుండా కాపాడ‌డంతో సినిమా మంచి హిట్ సాధించింది. మ‌రియు ఈ సినిమాకు దేవీ ప్ర‌సాద్ అందించిన సంగీతం కూడా ఒక హైలైట్ అని చెప్పొచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: