దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఈ సూత్రం మిగిలిన వారి సంగతేమో కానీ సినిమా హీరోయిన్లకు మాత్రం ఖ‌చ్చితంగా సూట్ అవుతుంది. ఎందుకంటే.. ఒక హీరోయిన్‌కు స్టార్ డమ్‌ ఎప్పుడొస్తుందో తెలీదు.. అలాగే ఎంత కాలం ఉంటుందో కూడా తెలీదు. మ‌రియు హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ టైమ్ కూడా చాలా తక్కువ. అయితే హీరోయిన్లు ఎప్పుడైతే స్టార్ డమ్ కోల్పోతారో.. కెరీర్ మొత్తం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అంటారు డిమాండ్‌ ఉన్నప్పుడే డబ్బులు కూడబెట్టుకోవాలి. ఒక‌వేళ అలా చేయ‌లేదంటే చాలా దారుణ‌మైన‌ ప‌రిస్తితిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లే.. ఈ ఇద్ద‌రి హీరోయిన్ల ప‌రిస్థితి. 

మిథాలీ శర్మ.. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ సినిమాలమీద ఆసక్తితో  ముంబైకి  మకాం మార్చింది. మోడల్ గా కరియర్ స్టార్ట్ చేసి.. ఎట్టకేలకు భోజ్‌పురీ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో  హీరోయిన్‌గా నటించే అవకాశాలు రాలేదు.  దీంతో ముంబైలోని లొకండ్ వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ  బతుకుతోంది. ఒక‌సారి ఈమె కార్ అద్దాలు పగలకొట్టి దొంగతనం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు..అప్పుడు ఆమె పోలీసులను అడిగిన ఒకే ఒక కోరిక భోజనం పెట్టమని..అప్పటికి ఆమె భోజనం చేసి రెండు రోజులయిందట. మిథాలీ మానసిక స్థితి  బాగాలేదని గుర్తించిన పోలీసులు.. ఆమెకు త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు చేర్చారు.

గీతాంజలి నాగ్ పాల్.. వెండితెర విషాద జీవితాల గురించి మాట్లాడుకుంటే.. అలాంటి వారి లిస్ట్ ముందు వ‌ర‌స‌లో ఉంటే పేరు గీతాంజలి నాగ్ పాల్. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ అయిన గీతాంజలి.. సుస్మిత సేన్‌కు పోటీగా ర్యాంప్ పై నడిచి అంద‌రినీ ఆక‌ర్షించింది. అదిరిపోయే అందంతో ఎంత‌రో అభిమానుల‌ను సొంతం చేసుకున్న గీతాంజ‌లి కెరీర్లో ఫెయిల్ అవ్వడంతో డిప్రషన్ లో కూరుకుపోయి డ్రగ్స్ కి అలవాటు పడి ఢిల్లీ రోడ్ల మీద అడుక్కుంటూ జీవితం గడిపింది. చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకొని మృతి చెందింది. ఇక ఫ్యాషన్ చిత్రంలో కంగనా పోషించిన పాత్ర ఎవ‌రిదో కాదు.. ఈ గీతాంజలిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: