టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది తమన్నా. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేయడమే కాకుండా ఆ సినిమాల విషయంలో ఆమె వ్యవహరించిన తీరు ఆమె పడిన కష్టం అందరికి తెలిసిందే. చాలా వరకు కూడా అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు మంచి పాత్రలు వచ్చాయి. ఇక హీరోయిన్ గా కూడా ఆమెకు మంచి గుర్తింపు అనేది వచ్చింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక వార్తా ఏంటీ అంటే ఆమె హీరోయిన్ పాత్రలకు ఇక గుడ్ బై చెప్పే ఆలోచనల ఉంది అని సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే... 

 

ఆమెకు హీరోయిన్ గా వచ్చే ఆఫర్ల కంటే కూడా ఆమెకు వచ్చే ఆఫర్లలో చాలా భాగం కూడా... ఐటెం సాంగ్ పాత్రలే వస్తున్నాయి. ఒక సాంగ్ చేయడం ఇక మళ్ళీ ఎప్పుడో ఒక పాటలో కనపడటం ఇక ఆ సినిమా వద్దు అని భావించి ఆమె ఇప్పుడు హీరోయిన్ గా కాదు ఇక ప్రకటనల కు సంబంధించినవి చేయాలి అని నిర్ణయానికి వచ్చింది అని టాక్. చూడాలి  మరి ఆమెకు ఏ విధంగా అవకాశాలు వస్తాయి అనేది. ఇప్పుడు ఆమె మన తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.

 

ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు అని కూడా తెలుస్తుంది. ఇక అందుకే ఆమె కొన్ని రోజుల పాటు ఇక వాటికి దూరంగా ఉండటమే మంచిది అనే నిర్ణయానికి వచ్చింది అని సమాచారం. చూడాలి మరి ఆమె ఏ విధంగా చేస్తుంది అనేది. ఇప్పుడు ఒక విషయం ఏంటీ అంటే ఆమెకు పారితోషికం కూడా భారీగా తగ్గించారు అని సమాచారం. అందుకే ఆమె కాస్త సినిమాల మీద దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: