బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కు రంగం సిద్ధమవుతుంది. ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు స్టార్ కంటెస్టంట్స్ ను తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామందిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదేకాకుండా తెలుగు సీజన్ 4 ఎవరు హోస్ట్ చేస్తారన్న దాని మీద కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్, సెకండ్ సీజన్ నాని, థర్డ్ సీజన్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు హోస్టులుగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు నాల్గవ సీజన్ కు మొదట్లో తారక్ హోస్ట్ గా రీ ఎంట్రీ ఇస్తాడని అన్నారు. కొద్దిరోజులుగా సీజన్ 4 కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి.

 

లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ హీరోయిన్ హోస్ట్ గా వ్యవహరించబోతుందని టాక్. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న టైం లో కూడా ఒక వీకెండ్ నాగ్ బదులుగా శివగామి రమ్యకృష్ణ బిగ్ బాస్ ను హోస్ట్ చేయడం జరిగింది. ఆడియెన్స్ కు అదో పెద్ద సర్ ప్రైజ్ లాగా అనిపించడంతో ఈసారి హోస్ట్ గా స్టార్ హీరోయిన్ నే చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక బిగ్ బాస్ ను హ్యాండిల్ చేసే స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఇంకెవరు అక్కినేని కోడలు సమంత అంటున్నారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన సాం సెలెక్టెడ్ సినిమాలను చేస్తుంది.

 

ఇక ఇప్పుడు వెబ్ సీరీస్ లకు సైన్ చేసిందని తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హోస్ట్ గా కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఇలాంటి షోస్ కి ఫీమేల్ హోస్ట్ అంటే కొద్దిగా కష్టమనే చెప్పాలి. కంటెస్టంట్స్ ని అరవాలన్నా.. వాళ్లకి క్లాస్ పీకాలన్నా.. వాళ్లని భయపెట్టి కంట్రోల్ లో పెట్టాలన్నా సరే మేల్ హోస్ట్ అయితేనే బెటర్. అలాటిది సమంత లాంటి స్టార్ హీరోయిన్ హోస్ట్ గా చేస్తుందని వార్తలు రావడం షాకింగ్ గా ఉంది. మరి బిగ్ బాస్ సీజన్ 4 నిజంగానే సమంత హోస్ట్ గా చేస్తుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: