మన హీరోలు వెండితెరపైనే కాదు.. బయట కూడా సాహసాలు చేస్తూ ఉంటారు. అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే డేర్ చేయక తప్పదు. ఈ ప్రయత్నం ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు.. ఒక్కోసారి సక్సెస్ కావచ్చు. ఎవరైనా హిట్ కొడదామనే డేర్ చేస్తారు. 

 

సాహో టైటిల్ ప్రభాస్ కు యాప్ట్ అవుతుంది. చిత్ర దర్శకుడు సుజిత్ కు ఒక్క సినిమా తీసిన అనుభవమే ఉంది. రన్ రాజా రన్ తో దర్శకుడిగా పరిచయమై ఓకే అనిపించుకున్నాడు. డెబ్యూ మూవీతో ప్రేక్షకుల కంటే ప్రభాస్ ను ఎక్కువగా మెప్పించి సాహో లాంటి పాన్ ఇండియా మూవీ ఛాన్స్ కొట్టేశాడు. ఇలా బాహుబలి2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇలా ఒన్ మూవీ ఎక్స్ పీరియన్స్ ఉన్న డైెరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి ప్రభాస్ పెద్ద సాహసమే చేశాడు. 

 

ప్రభాస్ సాహసాల పరంపర కొనసాగుతూనే ఉంది. సాహో రిలీజ్ కాకుండానే.. మరోసారి ఒన్ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణతో రాధే శ్యామ్ మూవీ మొదలుపెట్టాడు. సుజిత్ రన్ రాజా రన్ సక్సెస్ తో మెప్పిస్తే రాధాకృష్ణ తీసిన జిల్ ఫ్లాప్ అయినా.. బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు ప్రభాస్. ఇలా బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కెరీర్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయాలతో నడిచిపోతుంది. 

 

భీష్మ హిట్ తో నితిన్ కూడా ఓ అడుగు ముందుకేసి ధైర్యం చేశాడు. లిరికల్ రైటర్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్యతో భారీ బడ్జెట్ మూవీకి ఓకే చెప్పాడు. ఇష్క్ లో ప్రియా.. ప్రియా.. గుండెజారి గల్లంతయిందే లో టైటిల్ సాంగ్ తో పాపులర్ అయిన కృష్ణ చైతన్య.. రౌడీ ఫెలోతో మెగాఫోన్ పట్టాడు. డెబ్యూ మూవీ ఓకే అనిపించుకున్నా.. నితిన్ తో తీసిన రెండో మూవీ ఛల్ మోహన రంగా నిరాశపరిచింది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: