తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షోలలో షో బిగ్ బాస్ షో ఒకటి. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజాదరణ దక్కించుకున్న ఈ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని ప్రేక్షక ఆదరణ దక్కించుకున్న ఈ షో నాలుగో సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఆశగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జరిగిన మూడు సీజన్లు టెలివిజన్ రంగంలో మంచి రేటింగ్ లు అందుకోవటం తో నాలుగో సీజన్ కోసం భారీ స్థాయిలో ముస్తాబవుతున్నారు షో నిర్వాహకులు. ఈ నేపథ్యంలో సీజన్ ఫోర్ హోస్ట్ గా ఎవరు ఉంటారు అన్న దానిపై సోషల్ మీడియాలో వార్తలు ఊహాగానాలు జోరుగా వినబడుతున్నాయి.

IHG

మొదటి సీజన్ లో ఎన్టీఆర్, రెండవ సీజన్ లో నాని, మూడవ సీజన్ లో నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే మళ్లీ సీజన్ ఫోర్ కి నాగార్జున యే హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా నాగార్జున కాకుండా అక్కినేని వారి కోడలు అక్కినేని సమంత పేరు కూడా వినబడుతుంది. ఇదే టైంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది.

IHG's risqué lace bustier dress for your ...

సీజన్ ఫోర్ ఈ సమయంలో నాగార్జున పుట్టినరోజు వేడుకలు టైములో ఇతర దేశాలకు కుటుంబంతో వెళ్లిన టైములో నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ యాంకరింగ్ చేసి ప్రేక్షకులను బిగ్ బాస్ హౌస్ సభ్యులను ఎంతగానో అలరించారు. ఇటువంటి నేపథ్యంలో సమంత పేరు ఎక్కువ వినబడుతున్న తరుణంలో ఆమెతో పాటు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు కూడా బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ గా చేసే అవకాశం ఉన్నట్లు వినబడుతోంది. మరి ఎవరు హోస్ట్ గా ఉంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: