ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొన్నటివరకు బయోపిక్ ల పర్వం కొనసాగింది. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అనేక సినిమాల ఇండస్ట్రీల డైరెక్టర్లు సొంతంగా కథలు రాయకుండా ఎవరో ఒకరి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు బయోపిక్ రూపంలో చిత్రీకరిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. సినిమా రంగానికి సంబంధించి అదేవిధంగా రాజకీయ రంగానికి క్రీడా రంగానికి చెందిన ప్రముఖుల జీవితాలను ఆధారం చేసుకుని మొన్నటి వరకు అన్నీ ఇండస్ట్రీలలో బయోపిక్ లో ట్రెండ్ కొనసాగింది. దీనిలో భాగంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించి బయోపిక్, అలాగే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ది మరియు అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెలుగులో కూడా బయోపిక్ లు రావటం జరిగాయి.

IHG

అయితే తాజాగా మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ పక్కనపెడితే ప్రస్తుతం అంతా ఆర్మీ చుట్టూ స్టోరీలు వస్తున్నట్లు అర్థం అవుతున్నాయి. దేశ సైనికుల తరహాలో హీరోయిజం ఎలివేషన్ చేస్తూ స్టోరీ అల్లుతూ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే నా పేరు సూర్య, సరిలేరు నీకెవ్వరు సినిమా ఆ తరహాలోనే రావటం జరిగింది. మరి అదే విధంగా మహేష్ బాబు నిర్మాణ సారథ్యంలో అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'మేజర్' సినిమా కూడా మిలటరీ బ్యాక్ డ్రాప్ లో నే తెరకెక్కుతోంది.

IHG

ఇదిలా ఉండగా తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'జనగణమణ' సినిమా కూడా మిలటరీ తరహాలోనే ఉండ బోతున్నట్లు ఫిలింనగర్ టాక్. మొత్తంమీద చూసుకుంటే ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ మొత్తం మిలటరీ స్టోరీ ల చుట్టూ తిరుగుతుంది అని సినిమా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: