టాలీవుడ్ ను పర్ ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు టాలీవుడ్ కుర్రాళ్లు. షూటింగ్స్ కు లాంగ్ బ్రేక్ రావడంతో ఖాళీ సమయాన్ని కండలు పెంచేందుకు ఉపయోగిస్తున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ కు టాప్ ప్రియారిటీ ఇస్తూ జిమ్ ల్లో గంటలకొద్దీ గడిపేస్తున్నారు.

 

కరోనా కాలంలో ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్లు గట్టిగా చెబుతున్నారు. ఇక డాక్టర్లు చెబుతున్న మాటలని టాలీవుడ్ కుర్రాళ్లు చాలా సీరియస్ గా  తీసుకున్నారు. బోల్డ్ హీరో కార్తికేయ అయితే.. ఫిట్ నెస్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడీ సిక్స్ ప్యాక్ ని మరింత కష్టపెట్టి సన్నని నడుమున్న కుర్రాడిగా మారిపోయాడు కార్తికేయ. ఇక ఈ లుక్ చూసి చిరంజీవి కూడా ఆశ్చర్యపోయాడు. కార్తికేయని అభినందించాడు. 

 

యూత్ ఫుల్ క్యారెక్టర్స్ ను మెప్పిస్తున్న సందీప్ కిషన్ ఈ లాక్ డౌన్ ని వర్కవుట్ సీజన్ గా మార్చుకున్నాడు. బ్రేక్ మొత్తాన్ని జిమ్ లోనే గడిపేశాడు. 12కేజీల వరకు బరువు తగ్గి, ఫుల్ ఫిట్ గా మారిపోయాడు సందీప్. తర్వాత చేయబోయే ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో కొత్త లుక్ లో కనిపించాలని సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. 

 

సినిమాకో జానర్ తో అలరిస్తోన్న నిఖిల్ ఈ లాక్ డౌన్ ను అన్ని యాంగిల్స్ లో ఉపయోగించుకున్నాడు. కరోనా కాలంలోనే పెళ్లి చేసుకున్న నిఖిల్, ఈ సీజన్ లోనే కండలు కూడా పెంచాడు. ఒక వైపు కరోనా వారియర్స్ కోసం తనవంతు సాయం చేస్తూనే జిమ్ కు  టైమ్ కేటాయించాడు. మజిల్డ్ బాడీతో ఉన్న ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నాడు. 

 

విజయ్ దేవరకొండ ఎప్పుడూ కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తూనే ఉన్నాడు. లుక్ నుంచి మొదలుపెడితే స్టోరీ వరకు ఏదో చేయాలని ఆరాటపడుతుంటాడు. ఈ ఆరాటానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో భారీ మార్షల్ ఆర్ట్ మూవీ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించేందుకు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక అనుకోకుండా వచ్చిన ఈ లాక్ డౌన్ మొత్తాన్ని ఈ వర్కవుట్స్ కు వినియోగిస్తూ కండలు పెంచుతున్నాడు ఈ రౌడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: