కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందన్న సత్యాన్ని లేటుగా గ్రహించాడు. కరోనా తగ్గుతుందేమో.. పెళ్లి చేసుకుందామని వెయిట్ చేసి చేసి విసిగిపోయాడు. కరోనాతో పెట్టుకుంటే.. పెళ్లి ఇప్పట్లో అవ్వదన్న విషయాన్ని తెలుసుకొని.. శ్రావణ మాసంలో ఓ ఇంటివాడవుతున్నాడు ఈ యంగ్ హీరో. 

 

సినిమాలు.. యాక్టింగ్ తప్ప మరో ధ్యాస లేని నితిన్ కెరీర్ కు శ్రీనివాస కల్యాణం బ్రేకులేసింది. ఇందులో నటించిన తర్వాత పెళ్లిపై ఓ మంచి అభిప్రాయం వచ్చిందన్నాడు నితిన్. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగిందని చెప్పాడు. శ్రీనివాసకల్యాణం తర్వాత భీష్మ మూవీతో హిట్ కొట్టిన నితిన్ పెళ్లి కూతురను చూసుకున్నాడు. 

 

నితిన్, షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆల్ రెడీ ఎంగేజ్ మెంట్ జరుగగా.. ఏప్రిల్ లో దుబాయ్ లో డెస్టినేషన్ మ్యారేజ్ కు ప్లాన్ వేశారు. అక్కడి రిసార్ట్ ను బుక్ చేయడంతో పాటు.. ఫ్లైట్ టిక్కెట్స్ కూడా బుక్ చేశారు. భారీ లెవల్ లో చేసిన ఈ ప్లాన్ ను కరోనా ఫ్లాప్ చేసింది. ఏప్రిల్ లో జరగాల్సిన మ్యారేజ్ వాయిదా పడింది. 

 

ఏముందిలే.. ఓ నెల ఆగితే కరోనా తగ్గిపోతుంది.. పెళ్లి చేసుకోవచ్చని నితిన్ భావించాడు. జూన్ వెళ్లి జులై వస్తున్నా.. కరోనా ప్రభావం పెరిగిందే కానీ.. తగ్గలేదు. ఎప్పుడు తగ్గుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో బంధువులు.. శ్రేయేభిలాషుల సమక్షంలో పెళ్లి చేసేయాలని.. నితిన్, షాలిని ఫ్యామిలీ భావిస్తున్నారట. శ్రావణ మాసం రాగానే.. జులై చివర్లో లేదంటే.. ఆగస్ట్ మొదట్లో నితిన్ ఇంట భాజాభజంత్రీలు మోగనున్నాయి. 

 

మొత్తానికి కరోనా వైరస్ నితిన్ పెళ్లికి అడ్డంకింగా మారింది. రోజురోజుకూ వైరస్ విజృంభిస్తుండంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. వేసుకున్న ప్లాన్ అంతా వృథా అవుతోంది. నితిన్ అయితే ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: