చేసింది 15 సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించిన హీరో అతను. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మన్నలను పొందిన ఆయన ప్రేమకథలు చేస్తే ఆయనే చేయాలి అన్నంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. లవర్ బోయ్ గా చేస్తూనే కెరియర్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే కెరియర్ లో వెనుకపడటమో.. లేక వ్యక్తిగత కారణాలో కాని కాలం అతన్ని మింగేసేలా చేసింది. తనంతట తానే సూసైడి చేసుకునేలా చేసింది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించో మీకు అర్ధమై ఉంటుంది.. అవును మీరు ఊహించింది కరెక్టే ఎవర్గ్రీన్ లవర్ బోయ్ ఉదయ్ కిరణ్ గురించే.. చిత్రం సినిమాతో మొదలై జై శ్రీరాం వరకు తన నటనతో మెప్పించిన ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ పూర్తి చేయకుండానే మరణించారు.

 

ప్రేమ కథలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే హీరో.. ముఖయంలో ఆ అమాయకత్వం.. పెదవి మీద చిరునవ్వు.. చూడగానే మన పక్కింటబ్బాయే అనిపించడం.. అమ్మాయిల కల రాకుమారుడు ఉదయ్ కిరణ్. తనని అభిమానించే వారందరిని వదిలి తను మరణించి అభిమానులకు శిక్ష వేశాడు ఉదయ్. ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి సినిమా చిత్రం చెప్పిన కథ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆ సినిమాకు అమరనేని నరేష్ రైటర్ కమ్ కో డైరక్టర్ గా పనిచేశారు. ఉదయ్ కిరణ్ మరణించిన టైంలో అతన్ని చాలా దగ్గరగా చూసిన వారిలో నరేష్ ఒకరు. 

 

ఉదయ్ కిరణ్ గురించి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆషికి 2 సినిమాలో సాంగ్ అంటే ఉదయ్ కు చాలా ఇష్టమని.. తన రింగ్ టోన్ అదే ఉండేదని అన్నారు. అంతేకాదు ఆ సినిమాను దాదాపు 50 సార్లకు పైగా చూసుంటారని.. ఎక్కడ ఏ సీన్.. ఏ డైలాగ్ అన్నది కూడా చెబుతారని అన్నారు నరేష్. ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో సూసైడ్ చేసుకోవడం ఉదయ్ కిరణ్ కు నచ్చలేదట. కాని కథ పరంగా అదే కరెక్ట్ అన్నారట నరేష్. సినిమాలో హీరో పాత్ర కూడా సూసైడ్ చేసుకోవడం ఇష్టం లేని ఉదయ్ కిరణ్ నిజ జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని అన్నారు నరేష్. హిందిలో అమితాబ్, షారుఖ్ ఖాన్ అంటే ఇష్టమని.. తెలుగులో చిరంజీవి గారిని బాగా అభిమానించే వారని అన్నారు నరేష్. ఇక చిరు ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకోకపోవడం కూడా ఆ ఏజ్ లో ఏం జరుగుతుందో తెలియలేదని తనతో ప్రస్తావించినట్టు.. తనకి జరిగిన దానికి వేరే వాళ్లని బ్లేమ్ చేసే వ్యక్తిత్వం ఉదయ్ కిరణ్ ది కాదని నరేష్ వెళ్లడించారు.    

  

అన్నుకున్న విధంగా చిత్రం చెప్పిన కథ రిలీజ్ అయితే.. ఆ తర్వాత ఓ మళయాళ సినిమా రిఫరెన్స్ తో పూర్తిగా ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో హీరోయిన్ గా చేయాలని అనుకున్నారని.. ఆ సినిమాలో తన స్నేహితుడు అల్లరి నరేష్ తన భర్తగా చేయించడానికి అడగాలని అన్నారట. యువ హీరోల్లో ఉదయ్ కిరణ్ కు అల్లరి నరేష్ బెస్ట్ ఫ్రెండ్ అని.. నానిని కూడా ఇష్టపడేవారని.. నాని చాలా తెలివైన వాడు.. మంచి పొజిషన్ లో ఉంటాడని చెప్పారట ఉదయ్. ఆయనతో పనిచేసిన తర్వాత తాను మూడు విషయాలు నేర్చుకున్నానని చెప్పిన నరేష్ ఆయన మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. త్వరలోనే చిత్రం చెప్పిన కథ ఓటిటిలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. మరి ఉదయ్ కిరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఉదయ్ కిరణ్ గురించి చిత్రం చెప్పిన కథ రైటర్, కో డైరక్టర్ అమరనేని నరేష్ చెప్పిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈ కింద వీడియోలో చూడండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: